బిగ్ బాస్ షోలో తొమ్మిదో వారం కొన్ని వింతలు జరిగాయి. అందులో మొదటగా అఖిల్ మోనాల్ విషయం. మోనాల్‌ను అఖిల్ నామినేట్ చేస్తారని ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. కానీ నామినేటే చేశాడు. ఆ దెబ్బకు ఇంటి సభ్యులు షాక్ అయ్యారు. మోనాల్ మాత్రం తెగ ఫీలైంది. నమ్మిన వాడు కూడా నట్టేట ముంచేశాడని బాగా హర్టైంది. ఒంటరిని అయ్యాను అంటూ ఎమోషనల్ అయింది.
ఇంట్లో అందరూ గ్రూపులు కట్టి ఉన్నారు. కానీ మోనాల్ మాత్రం ఒంటరిగానే సాగింది. ఈ వారం మొత్తం అఖిల్ మోనాల్ దూరంగానే ఉన్నారు. సోహెల్ విషయంలో మోనాల్ మాట మార్చిన తీరుకు అఖిల్ బాగా బాధపడ్డాడు. అందుకే మోనాల్‌కు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. అయితే మోనాల్ బాధ అంతా నాగార్జున నేడు తీర్చనున్నట్టు కనిపిస్తోంది. వీకెండ్ ఎపిసోడ్‌లో ఈ ఇద్దరి పంచాయితీ ఏంటో తేల్చనున్నాడు.
అఖిల్ నన్ను నామినేట్ చేస్తాడని ఎప్పుడు అనుకోలేదని, అతను నా ఫ్యామిలీ అని అనుకున్నాను అంటూ మోనాల్ బాధపడిపోయింది. ఇదే విషయాన్ని నేరుగా నాగార్జున అడిగేశాడు. మోనాల్ నీకు ఫ్రండేనా? అంతకు మించా? అని అందరి ముందే నిలదీశాడు. దీంతో అఖిల్ మొహం ఒక్కసారిగా మాడిపోయినట్టు కనిపిస్తోంది. మరి అఖిల్ ఏం చెబుతాడో చూడాలి. మోనాల్ అఖిల్ మళ్లీ కలుస్తారేమో చూడాలి.
Weekend roast ki andaru ready aa….Eeroju chala lekkalu telchali#BiggBossTelugu4 today at 9 PM on @StarMaa pic.twitter.com/9vu284Za6w
— Starmaa (@StarMaa) November 7, 2020