బిగ్ బాస్ హోస్ట్‌గా వచ్చేవారు కంటెస్టెంట్లను తమ ఫ్యామిలీలుగా మారిపోతుంటారు. ప్రతీ వారం కంటెస్టెంట్లను మందలించడం, హెచ్చరించడం, సలహాలు ఇవ్వడం, కలిసిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో వారితో ఓ అటాచ్మెంట్ ఏర్పడుతుంటుంది. ఆ క్రమంలో కొందరు కంటెస్టెంట్లు మరీ దగ్గరువుతుంటారు. నాని హోస్ట్‌గా ఉన్న సమయంలోనూ కంటెస్టెంట్ల విషయంలో బాగానే ఎమోషనల్ అయ్యాడు. రాఖీలు కట్టడంతో నాని నిజంగానే ఎమోషనల్ అయ్యాడు.
మూడో సీజన్‌లొ నాగార్జున కూడా అందరితో బాగానే కనెక్ట్ అయ్యాడు. ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేశాడు. షూలు, వాచ్‌లు బాగున్నాయని చెబితే వాటిని సదరు కంటెస్టెంట్లకు ఇచ్చేశాడు నాగార్జున. అలా అలీరెజాకు స్పెషల్‌గా షూలను పంపించాడు బిగ్ బాస్. వాచీని కూడా పంపించాడు. వాటిని తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకుంటూ అలీ రెజా ఆ మధ్య ఎమోషనల్ అయ్యాడు. తాజాగా అవినాష్ కూడా గాల్లో తేలిపోతున్నాడు.
నాగార్జున వీకెండ్‌లో వేసుకున్న షర్ట్ బాగుందని కితాబిస్తే.. దాన్ని అవినాష్‌కే గిఫ్ట్‌గా నాగార్జున పంపించాడట. ఈ విషయాన్ని అవినాష్ చెబుతూ సంబరపడిపోయాడు. కింగ్ నాగార్జున గారు.. షర్ట్ బాగుంది బాబు గారు అని చెప్తే గుర్తు పెట్టుకుని మరి ఇంటికి పంపారు.. లవ్యూ సర్.. మనం ఇంటరాక్ట్ అయ్యే ఆ రోజులను బాగా మిస్ అవుతున్నాను సర్ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం అవినాష్ షేర్ చేసిన ఫోటోబాగా వైరల్ అవుతోంది. టాప్ 5లో ఉండాల్సిన అవినాష్ గత వారంలో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.