కంటెస్టెంట్లందరికీ పంచ్ ఇచ్చాడు.. నాగార్జున నిర్ణయంతో వారంతా షాక్!!

బిగ్‌బాస్‌లో మూడో వీకెండ్ బాగానా జరిగింది. మూడో వారంలో జరిగిన అన్ని విషయాలను శనివారం నాడు టచ్ చేశాడు నాగార్జున. రోబోలు టాస్కును గెలవడం, మనుషుల టీం సభ్యులు ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం, రెచ్చిపోయిన సోహెల్, మెహబూబ్, మోసపోయిన అమ్మ రాజశేఖర్‌లను ఇలా ప్రతీ ఒక్కరికీ వారికి ఇవ్వాల్సింది ఇచ్చాడు, అయితే ఇక్కడే మనకు ఓ విషయం అర్థమవుతుంది. రోబో టాస్క్ గెలవడానికి అభిజీత్ వేసిన ఆ ప్లాన్ కారణమైంది. ఇలా తమను వెర్రి వెంగళప్పలను చేసిన అభిజీత్‌పై అందరూ ద్వేషాన్ని కోపాన్ని పెంచుకున్నారో ఇట్టే తెలిసిపోతోంది.

Bigg Boss 4 Telugu Nagarjuna Declares Abijeet Is Mahanayakudu

రోబోల టీం గెలిచినందుకు ఓ మూడు అవార్డులు ఇస్తానని నాగార్జున తెలిపాడు. మహా నాయకుడు, మహాకంత్రి, మహానటి అనే ఈ మూడు మెడల్స్‌ను ఎవరికి ప్రధానం చేయాలని కంటెస్టెంట్లను అడిగాడు నాగ్. ఈ క్రమంలో మహానాయకుడు ఎవరని నాగ్ ప్రశ్నించాడు. ఇక అందరూ ఏకాభిప్రాయంతో గంగవ్వ పేరును చెప్పారు. మహానాయకుడు అని ఎవరిని అంటారు.. టీంను అత్యంత చాకచక్యంగా నడిపించి గెలిపించిన వారిని అంటారు.

Bigg Boss 4 Telugu Nagarjuna Declares Abijeet Is Mahanayakudu

అలా చూసుకుంటే అభిజీత్‌ పేరును చెప్పాలి. కానీ అభిపై ఉన్న ద్వేషంతో ఎవ్వరూ కూడా ఆపేరును చెప్పకుండా.. గంగవ్వను చెప్పారు. కానీ నాగార్జున మాత్రం తన అభిప్రాయాన్ని చెబుతూ.. అభిజీత్‌ మహానాయకుడు అని డిక్లేర్ చేశాడు. మహాకంత్రి విషయంలో అందరి అభిప్రాయం ఒక్కటే. అదే అవినాష్. ఇక గంగవ్వ ఆడిన నాటకాలను చూపెట్టి మహానటి అని బిరుదిచ్చేశారు.