బిగ్‌బాస్ 4 సీజన్‌లో కొత్తజంటలు మొదలయ్యేట్టే కనిపిస్తోంది. అయితే నాగ్ లింక్ కలిపే జంటలు కాకుండా కొత్తగా ముడిపడేట్టు కనిపిస్తున్నాయి. మామూలగా అభిజిత్-మోనాల్ మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ అయ్యేట్టుగా ప్లాన్ వేశారు. అందుకు అనుగుణంగానే షో ప్రారంభంలోనూ అభిజీత్‌కు మోనాల్ ఫోటో చూయించాడు. ఇక పరిస్థితికి తగ్గట్టే ఫోటోను చూసి మోనాల్‌ను పెళ్లి చేసుకుంటానని అభిజీత్ సమాధానం ఇవ్వడంతో వీరిద్దిర మధ్య ఏదో ట్రాక్ వర్కౌట్ అవుతుందని అంతా భావించారు.
కానీ లోపలకు వెళ్లిన తరువాత ట్రాకులు మారాయి. అభిజీత్-మోనాల్ మనసు విప్పుకుని మాట్లాడుతున్నారు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇక టమోటా పల్ప్ టాస్క్‌లొ మోనాల్, అఖిల్ కాస్త దగ్గరయ్యారు. నిన్న నాగ్ మోనాల్, అభిజీత్ ట్రాక్ గురించి చెబితే అఖిల్ కాస్త అసహనంగానే కనిపించాడు. అఖిల్ మనసులో ఏదో మొదలైనట్టు కనిపించింది. ఇక అభిజీత్ విషయానికొస్తే మోనాల్ పట్ల అంత ఆసక్తి కనిపించడం లేదు.
అభిజిత్-హారికల జంట మధ్య ట్రాక్ మొదలైనట్టు కనిపిస్తోంది. పరిచయం లేని వాళ్లు అగౌరవంగా మాట్లాడితే భరించలేమని అభిజీత్ తరుపున మాట్లాడింది కూడా. ఇక వీరిద్దరు వర్షంలో తడుస్తూ.. అలా నేచర్‌ను ఎంజాయ్ చేస్తూ పాటలు కూడా పాడుకున్నారు. హారిక, మోనాల్‌లు హౌస్‌లో అబ్బాయిల గురించి ముచ్చట్లు పెట్టుకున్నారు. మగవాళ్లు అందరూ స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తుంటే.. గార్డెన్ ఏరియాలో ఉన్న హారిక, మోనాల్ ఆడోళ్లు ముచ్చట్లు ప్రారంభించారు.
ఎవ్వరూ హాట్‌గా లేరు.. ఒకరిద్దరు తప్పా అంటూ మోనాల్ చెప్పుకొచ్చింది. ఏం లేనప్పుడు ఏదో ఒకటి అంటూ హారిక సమాధానం ఇచ్చింది. సరే ఆ ఒకరిద్దరు ఎవరూ చూద్దాం అంటూ హారిక అంది. ఇక వెంటనే మోనాల్ అఖిల్ పేరు చెప్పింది. హారికేమో అభిజిత్ పేరు చెప్పింది. ఇలా వీరు మాట్లాడుకున్న ముచ్చట్లకు జల్సా వీడియోను యాడ్ చేసి నవ్వులు తెప్పించారు. ఆ వీడియో మీకోసం. మీరూ చూసి కాసేపు నవ్వుకోండి
Monal & Harika #BiggBossTelugu4 pic.twitter.com/wT2X76EiRg
— Krishnan (@Krishnan735) September 13, 2020