అందరూ వాడుకున్నారు.. కరాటే కళ్యాణి కథ వింటే కరిగిపోవాల్సిందే!

Bigg Boss 4 Telugu Karate Kalyani Life story

బిగ్‌బాస్ షో అంటే మనల్ని మనకు చూపించే అద్దమని చెప్పిన కరాటే కళ్యాణి.. ఈ షోకు రావడం వెనుకున్న ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెప్పేసింది. కరాటే కళ్యాణికి కృష్ణ సినిమాలో చేసిన బాబీ అనే క్యారెక్టర్ బాగా పేరుతెచ్చింది. అక్కడి నుంచి ఆమెను గుర్తించడం ప్రారంభించారు. అయితే సినిమాలో అలాంటి క్యారెక్టర్ చేస్తాను.. గానీ నిజ జీవితంలో అలాంటి క్యారెక్టర్ కాదని అందరికీ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ వివరించింది.

Bigg Boss 4 Telugu Karate Kalyani Life story
Bigg Boss 4 Telugu Karate Kalyani Life story

తనకు చదువు అబ్బ లేదు గానీ సంప్రదాయ కలల మీద మక్కువ పెరిగిందని తెలిపింది. చిన్నప్పటి నుంచి హరికథల మధ్యే పెరిగానని, తన తండ్రి గారు అవి చెబుతూనే పోషించారని, తాను కూడా చెప్పేదాన్ని అని పేర్కొంది. హరి కథలే తనకు అన్నం పెట్టాయని చెప్పుకొచ్చింది. ఇక జీవితంలో ఓ కోరిక తీరలేదని, తన సీమంతం రోజున తన గర్భాన్ని చూసుకోవాలనే కోరిక తీరలేదని చెప్పుకుని బాధపడింది. పెళ్లిళ్లు కొందరికి అదృష్టంగా మారుతాయి.. మరికొందరికి దురదృష్టంగా అవుతాయని తెలిపింది.

పెళ్లి జరిగిన ప్రతీసారి గర్భం వచ్చేది పోయేది. అందరూ నన్ను మోసం చేశారు. అందరూ వాడుకోవాలని చూసిన వారే అని తన వ్యథనంతా వెల్లగక్కుంది. చివరకు ఓ ఊరి నుంచి ఫోన్ వచ్చింది.. ‘ఇక్కడ ఓ పిల్లాడిని ఎవరో వదిలేశారు.. మీరు పెంచుకుంటారని అన్నారు కదా తీసుకుంటారా?’ అని అన్నారు. ఆ పిల్లాడినే ఇప్పటికి నా గుండెలపై పెట్టుకుని పెంచుకుంటున్నాను అని తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది కరాటే కళ్యాణి.