ఐటెం రాణి హారిక.. బాగానే హర్టైనట్టుంది!!

Bigg Boss 4 Telugu Harika Gets Award With Item Rani

ఐటెం సాంగ్, ఐటెం గర్ల్ అంటూ ఒకప్పుడు పాజిటివ్ అర్థం ఉందేమో. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం దానికి నెగెటివ్ అర్థమే వచ్చి చేరింది. ఐటెం అనడంతో అందరూ వేరే దృష్టితో చూసేస్తున్నారు. అందుకే సినిమాల్లో ఐటెం సాంగ్ అనడం దాదాపు మానేశారు. స్పెషల్ సాంగ్, స్పెషల్ అప్పియరెన్స్ అంటూ వస్తున్నారు. కానీ ఐటెం సాంగ్, గర్ల్ అనేది మాత్రం ఇంకా వాడుకలోనే ఉంది. సాధారణ జనం మాత్రం ఇంకా అలానే పిలుస్తున్నారు. వాడుతున్నారు.

Bigg Boss 4 Telugu Harika Gets Award With Item Rani
Bigg Boss 4 Telugu Harika Gets Award With Item Rani

అయితే బిగ్ బాస్ ఏడో వారంలో కంటెస్టెంట్లకు ఇచ్చిన టాస్క్‌లో అందరూ కలిసి ప్రేమ మొదలైంది అనే చిత్రాన్ని చేశారు. ఇందులో అభిజిత్ దర్శకుడిగా, నోయల్ కెమెరామెన్‌గా, అమ్మ రాజశేఖర్ కొరియోగ్రాఫర్‌గా, రైటర్ కమ్ హీరోగా అవినాష్, హీరోగా అఖిల్, హీరోయిన్లుగా మోనాల్, అరియానా, విలన్‌గా మెహబూబ్ నటించారు. ఇక హారిక, సోహెల్‌లు ఐటెం సాంగ్‌లో నటించాలని బిగ్ బాస్ చెప్పడంతో కెవ్వు కేక అనే పాటకు డ్యాన్సులు చేశారు.

Bigg Boss 4 Telugu Harika Gets Award With Item Rani
Bigg Boss 4 Telugu Harika Gets Award With Item Rani

అయితే ఈ విషయంలో లాస్య సోహెల్ ఐటెం రాజా అనడంతో అక్కడ సోహెల, హారికలు కాస్త ఫీలైనట్టు కనిపించింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో బీబీ స్టార్ అవార్డ్స్ కూడా ప్రధానం చేశారు. ప్రేమ మొదలైంది హిట్ అవ్వడంతో బీబీ స్టార్స్ అవార్డ్స్ నిర్వహించారు. ఇందులో హారికకు ఐటెం రాణి అనే అవార్డు వచ్చింది. అలా ఐటెం రాణి అని పిలవడం తనకు నచ్చనట్టు కనిపించింది. అయితే స్టేజ్ మీదకు వచ్చిన హారిక బాగానే మాట్లాడింది. అలా సూట్ అవ్వడం, అలా అనిపించుకోవడం కూడా చిన్న విషయమేమీ కాదని చెప్పింది. కానీ దాని తర్వాత నుంచి హారిక మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ మారాయి. ఐటెం రాణి విషయంలో హారిక బాగానే హర్ట్ అయినట్టు కనిపిస్తోంది.