తెలంగాణ యాస, భాష, మట్టి వాసనతో మమేకమైన గంగవ్వ గురించి అందరికీ తెలిసిందే. మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానెల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రపంచం గుర్తించే వరకు ఎదిగింది. ఆ గుర్తింపే ఇప్పుడు గంగవ్వకు బిగ్‌బాస్ అవకాశం తెచ్చిపెట్టింది. అయితే ఇంత వరకు మనకు గయ్యాలిదానిలో, చాదస్తపు అవ్వగానో, ప్రేమను పంచే ముసలవ్వలానే తెలుసు. కానీ గంగవ్వ జీవితంలోని చీకటి కోణం, విషాదం మాత్రం ఎవ్వరికీ తెలీదు.
బిగ్‌బాస్ వేదికగా తాను పడిన కష్టాలన్నింటిని చెప్పి అందర్నీ కంటతడి పెట్టించింది. ఐదేండ్లప్పుడు పెళ్లైందని తన భర్త, మామ చనిపోయిన తరవాత ఎవ్వరూ దగ్గరకు తీసుకోలేదని కంటతడి పెట్టింది గంగవ్వ . తినడానికి తిండి కూడా ఉండేది కాదని గోడును వెల్లడించింది. భర్త దుబాయ్ వెళ్తానంటే.. అప్పులు చేసి దుబాయ్ పంపానని చెప్పుకొచ్చింది. ఏడేళ్లు దుబాయ్‌లో ఉన్న తన భర్త ఒక్క రూపాయి పంపలేదని.. అక్కడే చచ్చిపోయాడమో అనుకున్నానని తెలిపింది.
ఒక బిడ్డకు పిట్స్ వచ్చింది. పైసల్లేవ్. దవాఖానలో అప్పుడు బాగా శ్రద్ధ చేయలేదు. దవాఖానాలో చనిపోతే ఇంటికి ఎత్తుకొని వచ్చినా నడిచి అంటూ జీవితంలో అతి కష్టమైన సంఘటనను వివరించింది. తనకు రూ.8 లక్షల అప్పు ఉండేదని.. మూడేళ్లు కష్టపడి తీర్చానని చెప్పింది. ఇక మై విలేజ్ షోలోకి ఎంటరయ్యాక జీవితానికి ఇప్పుడు కొంత విలువ వచ్చిందని చెబుతూ తెలుగు ప్రేక్షకులను ఏడిపించేసింది గంగవ్వ.