బిగ్‌బాస్ షో మొదలై మూడు రోజులు నాలుగు ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. పదహారు మంది కంటెస్టెంట్లలో అందరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక మాటైనా మాట్లాడారు. కనీసం ఓ రెండు నిమిషాల పాటైనా కనిపించారు. కాని దివి మాత్రం అస్సలు కనిపించనే లేదు. ఎన్ని గొడవలు జరిగినా, ఎంత మంది తిట్టుకున్నా సరే దివి మాత్రం తన ధోరణి తానే, తన ప్రపంచం తానే అన్నట్టుగా ఉండేది. దివి నోరు విప్పి మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలని ఎంతో మంది ఆశపడ్డారు.
ఒక్కసారైనా దివితో మాట్లాడించు బిగ్‌బాస్, కనీసం ఓ ఐదు నిమిషాల పాటు చూపించు అంటూ కోరారు.వారి ప్రార్థన, కోరిక బిగ్‌బాస్ విన్నాడో ఏమో గానీ తాజాగా అదిరిపోయే ప్రోమోను రిలీజ్ చేశాడు. అందరికీ వరుసబెట్టి ఓ రేంజ్‌లో ఇచ్చిపడేసింది. ఇక దివి మాటలకు, లుక్స్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. హౌస్‌మేట్స్‌పై అభిప్రాయాన్ని చెప్పవల్సిందిగా దివికి టాస్క్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో దివి ఒక్కొక్క హౌస్‌మేట్స్ గురించి చిట్టా విప్పింది. మోనాల్ ఎమోషనల్ అని.. ప్రతీ చిన్న విషయానికి ఏడుస్తుంది.. సీరియస్ విషయమైనప్పుడు వెళ్లిపోతోందని, లాస్యను కూడా అలాగే ఏదో కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. అఖిల్ విషయంలోనూ ఏదో కామెంట్ చేసినట్టుగానే కనిపిస్తోంది. ఇక సూర్య కిరణ్‌ను మాత్రం ఓ రేంజ్‌లో కార్నర్ చేసింది. నా మాటే వినాలే అనే మనస్తత్వం అది కొంచెం తగ్గించుకుంటే మంచిది అంటూ దివి సలహా ఇచ్చింది. నేను తగ్గించను అంటూ గొంతు పెంచాడు. ఇక మరి నేటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.