బిగ్‌బాస్ నాల్గో సీజన్ ప్రారంభమై మెల్లిమెల్లిగా అందర్నీ ఆకట్టుకుంటోంది. మొదట్లో కంటెస్టెంట్ల విషయంలో ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే షో ముందుకు వెళ్తోన్న కొద్దీ కాస్త ఇంట్రెస్టెంట్ కలుగుతోంది. అయితే షో ప్రారంభమైనా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కనీసం ఒక్క మాటైనా మాట్లాడితే చూడాలని, మాట్లాడకుండానే ఎలిమినేట్ అవుతుందా? అని నెటిజన్స్ సెటైర్స్ వేశారు. దివి ఫ్యాన్స్ మాత్రం బిగ్‌బాస్‌ను గట్టిగా కోరుకున్నట్టున్నారు. వారి మొర ఆలకించిన బిగ్‌బాస్ దివితో స్పెషల్ టాస్క్ చేయించాడు.
హౌస్‌మేట్స్‌లో ఏ విషయాన్ని మార్చాలని అనుకుంటుందో చెప్పాల్సిందిగా దివికి టాస్క్ ఇచ్చాడు. ఇక ఒక్కొక్కరిని ఎంచుకుంటూ.. బయట వారిపై ఎలాంటి అభిప్రాయం ఉంది, ఏ టాక్ నడుస్తోందో.. అదే విషయాన్ని దివి చెప్పింది. నా మాటే నెగ్గాలని అనే దాన్ని కొంచెం తగ్గించుకోవాలని సూర్యకిరణ్‌కు చెప్పింది. ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేయోద్దని, ప్రతీ విషయంలో దూరొద్దని, తరువాత బాధపడొద్దని కరాటే కళ్యాణికి చెప్పింది.
ఊరికే ఫీల్ అవుతుంది, తన గురించే మాట్లాడుతామనుకుని హర్ట్ అవుతుందని లాస్య గురించి చెప్పుకొచ్చింది. ఏదైనా నేరుగా పాయింట్ మాట్లాడుతాడని నోయెల్, ఎప్పుడు సైలెంట్‌గా ఉంటాడు? ఎప్పుడు ఫైర్ అవుతాడో తెలీదని అభిజీత్ గురించి చెప్పింది. ఎవరైనా ఏడిస్తే నువ్ కూడా వెంటనే ఏడుస్తావ్ అలా ఏడ్వొద్దని గంగవ్వకు సలహా ఇచ్చింది. ఆరియానా, సోహెల్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ విషయంలోనూ దివి తన అభిప్రాయాన్ని క్లియర్‌గా చెప్పింది.
ఇక మొదటిసారి బిగ్‌బాస్ హౌస్‌లో దివి అంతగా మాట్లాడేసరికి.. హౌస్‌మేట్స్‌తో పాటు, ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు. అమ్మ రాజశేఖర్, సూర్య కిరణ్, లాస్య ఇలా అందరూ దివిని చూసి ఆశ్చర్యపోయారు. ఆమె సైలెంట్‌గా ఉంటూనే ఇంత గమనించిందా? అంటూ షాక్ అయ్యారు. తాను అన్ని విషయాల్లో దూరను, ఎక్కువగా మాట్లాడను కానీ గమనిస్తాను అంటూ దివి చెప్పడంతో ఆమె క్యారెక్టర్‌పై అందరికీ ఓ స్పష్టత వచ్చింది.