బిగ్ బాస్ 4 : సోహెల్‌ను ఎత్తేశారు.. అభిజిత్‌ను తొక్కేశారు..అసలు విజేత ఎవరు?

Bigg Boss 4 Telugu Chiranjeevi Praises Sohel Than Abhijeet

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో మరోసారి చూపించారు. గత సీజన్ మాదిరిగానే చిరంజీవి తనకిచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. అదే కృతకంగా స్క్రిప్ట్ ప్రకారం ముందుకు పోయాడు. కానీ ఈ సారి మరింత ముందుకు వెళ్లాడు. సోహెల్, మెహబూబ్‌లను లేపారు. టాప్ 2లను పక్కన పెట్టుకుని వారిని గంటల సేపు అలానే ఉంచేశారు. సోహెల్‌తోనే ఎక్కువ సేపు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాడు. మటన్ గురించి, సురేఖ చేసి పంపించింది.. నీకోసమే అంటూ పైకి లేపేశాడు.

Bigg Boss 4 Telugu Chiranjeevi Praises Sohel Than Abhijeet
Bigg Boss 4 Telugu Chiranjeevi Praises Sohel Than Abhijeet

కథ వేరే ఉంటది అంటూ మ్యానరిజాన్ని ప్రదర్శించి అసలు విజేత సోహెల్ అన్నంత బిల్డప్ ఇచ్చాడు. పైగా సోహెల్ తీయబోయే సినిమాలో అతిథి పాత్ర ఇవ్వమని అడిగాడు. సినిమాను దగ్గరుండి మరీ ప్రమోట్ చేస్తానని చెప్పాడు. 25 లక్షలు తీసుకుని బయటకు వచ్చాక.. అందులో పది లక్షలు అనాథ పిల్లలకు ఇస్తానని చెప్పాడు.. తన ఫ్రెండ్‌ మెహబూబ్‌కు ఐదు లక్షలు ఇస్తానని తెలుసుకున్న చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు.

Bigg Boss 4 Telugu Chiranjeevi Praises Sohel Than Abhijeet
Bigg Boss 4 Telugu Chiranjeevi Praises Sohel Than Abhijeet

అలా అక్కడికక్కడే మెహబూబ్‌కు పది లక్షల చెక్కు ఇచ్చాడు. చిరు ఆ పని ఎందుకు చేశాడో ఎవ్వరికీ తెలీదు. మెహబూబ్‌కు ఇచ్చాడు సరే అది పక్కన పెడదాం. మరి టాప్ 2 వచ్చిన కంటెస్టెంట్‌కు చిల్లిగవ్వ కూడా దక్కలేదు. దాని గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. అలా అభిజిత్ విజేతగా అఖిల్ రన్నర్‌గా మిగిలిన కూడా నిన్నటి షో మొత్తం సోహెల్, మెహబూబ్‌ల చుట్టే తిరిగింది. అలా ట్రోఫీ గెలిచి బిగ్ బాస్ టైటిల్ సొంతం చేసుకున్న అభిజిత్ నిజమైన విజేతనా? లేదా సోహెల్ విజేతనా? అనే అనుమానం కలుగుతోంది. నెటిజన్లు ప్రస్తుతం దీని మీదే చర్చించుకుంటున్నారు.