Bigg Boss Telugu 4 : అందరూ కలిసి కుమ్మేశారు.. బిగ్‌బాస్‌లో ఒంటరిగా అవినాష్!!

Bigg Boss 4 Telugu Avinash Try To Flirt Divi And Swathi Deekshith

బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జబర్దస్త్ ఫేమ్ అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే మోనాల్‌తో పులిహోర కలిపేందుకు ట్రై చేశాడు. ఏకంగా పాట పాడి మెప్పించే ప్రయత్నం చేశాడు కూడా. కానీ అవేవీ వర్కౌట్ కావని గ్రహించాడు. ఎందుకంటే మోనాల్ చుట్టూ ఈగల్లా ఇప్పటికే ఇద్దరు తిరుగుతున్నారు. సరే అని అలా కామ్ అయిపోయాడు అవినాష్‌. ఇక ఉక్కు హృదయం అనే టాస్క్ గడిచాక అవినాష్‌పై అమ్మ రాజశేఖర్ కాస్త గుస్సా అయ్యాడు.

Bigg Boss 4 Telugu Avinash Try To Flirt Divi And Swathi Deekshith
Bigg Boss 4 Telugu Avinash Try To Flirt Divi And Swathi Deekshith

దివిని కిడ్నాప్ చేసినందుకు అభిజీత్, అవినాష్‌లపై అందరూ ఫైర్ అయ్యారు. ఇక నిన్నటి బిగ్ బాస్ అన్ సీన్‌లో అవినాష్‌ను అందరూ చుట్టు ముట్టేశారు. దివిని సిస్టర్ అని అను అంటూ అవినాష్‌పై ఒత్తిడి పెంచారు. నేను ఏమైనా దివి అంటే ఇష్టమా? దివి నాకు నచ్చిందని చెప్పానా? దివి కళ్లు బాగుంటాయని చెప్పానా? అంటూ దివి ముందే ఆ మాటలు అంటూ ఫ్లర్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇక దివితో పాటు అమ్మ రాజశేఖర్, సోహెల్, మెహబూబ్ అందరూ కలిసి దిండుతో దాడి చేశారు.

Bigg Boss 4 Telugu Avinash Try To Flirt Divi And Swathi Deekshith
Bigg Boss 4 Telugu Avinash Try To Flirt Divi And Swathi Deekshith

అలా దివి కూడా సైడ్ అయిపోయింది. ఇక కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతి దీక్షిత్‌ను అయినా వర్కౌట్ చేద్దామని ప్రయత్నించాడు. వచ్చీ రావడంతో ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. దానికి తగ్గట్టే బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడం జరిగింది. అయితే రాత్రి పూట గ్రీన్ టీ తాగాలని అభిజీత్‌ను అడగడం, ఇద్దరూ వెళ్లి ఆ సమయంలో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండటంతో అవినాష్ ఆశలు అడియాశలు అయ్యాయి. నేను సెట్ చేసుకుందామనుకుంటే అభిజీత్ ఎత్తుకెళ్లిపోయాడు.. మళ్లీ ఒక వైల్డ్ కార్డ్ వస్తే బాగుండేదని అవినాష్ సెటైర్ వేశాడు. పాపం అవినాష్ ఇలా ఎంత మందిని ట్రై చేసిన ఓ ట్రాక్ వేయలేకపోతున్నాడు.. ఒంటరిగానే మిగిలిపోతున్నాడు.