బిగ్ బాస్ షోలో అరియానా సోహెల్ కాంబో టామ్ అండ్ జెర్రీ లాంటిది. ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. చీటిమాటికి ఈ ఇద్దరి మధ్య ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. తనను అర్థం చేసుకోడు.. తన యాటిట్యూబ్ అతనికి నచ్చదని అరియానా చెప్పుకుంటుంది. అరియానా బిహేవ్ చేసే పద్దతి తనకు నచ్చదని సోహెల్ చెబుతూ ఉంటాడు. కానీ ఆమె చాలా మంచిది.. నిక్కచ్చిగా మాట్లాడుతుంది.. ఎంతో ధైర్యమున్న అమ్మాయి అని గొప్పగా చెప్పాడు.
అలా చెప్పడంపై సోహెల్ ఫీల్ అవుతున్నాడు. సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఈ ఇద్దరి మధ్య జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. అరియానా చెప్పే పద్దతి, చూపించే యాటిట్యూడ్‌ను సోహెల్ భరించలేకపోయాడు. సోహెల్ అరిచే విధానం తనకు నచ్చడం లేదని అరియానా చెప్పింది. అలాగే ఆమె యాటిట్యూడ్ కూడా తనకు నచ్చలేదని సోహెల్ కూడా మొహం మీదే చెప్పాడు. నామినేషన్ ప్రక్రియలో జరిగిన గొడవ వ్యక్తిగతంగా వెళ్లింది.
నిద్రపోయినందుకు, మైక్ ధరించనందుకు అరియానా సోహెల్‌కు పనిష్మెంట్లు ఇచ్చింది. వాటిని చేయనని సోహెల్ చెప్పడంతో అరియానా హర్టైనట్టుంది. తన కెప్టెన్సీలో అన్నీ కఠినంగా ఉంటాయని ముందే చెప్పాను అని శిక్షలు వెంటనే అమలు చేస్తానని ముందే చెప్పానని అరియానా తెలిపింది. నువ్ ఒక్క దానివే కెప్టెన్ అయ్యావా? మేము కాలాదా? నువ్ పుడింగివా అంటూ అరియానాను సోహెల్ ఏకిపారేశాడు.