బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పటి వరకు గొడవలు, ఏడ్పులు, వాగ్వాదాలు తప్పా ఎలాంటి రొమాంటిక్ యాంగిల్ బయటకు రాలేదు. ఓ ఇద్దరు కూర్చుని మనసు విప్పి మాట్లాడుకున్న దాఖలాలు కనబడలేదు. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో కాస్త కొత్త ట్రాక్‌లు ఏర్పడబోతోన్నట్టు కనిపించాయి. ఇక ప్రోమోలో చూపెట్టిన విధంగా.. అమ్మ రాజశేఖర్-దివి ట్రాక్ కామెడీ అని తెలిసిపోతోంది. పిచ్చా పాటీ ముచ్చట్ల కోసమే అలా అమ్మ రాజశేఖర్ చేస్తున్నాడని అర్థమైంది.
కానీ మోనాల్ చుట్టు మాత్రం ఓ ట్రాక్ నడిచేట్టు కనిపిస్తోంది. మామూలుగా అయితే అది అభిజీత్‌తోనే కావాలి. ఎందుకంటే మొదటి నుంచి వీరిద్దరూ చాలా క్లోజ్‌గా ఉంటున్నారు. అయితే టాస్క్‌లో మోనాల్, అఖిల్ కాస్త క్లోజ్ అయినట్టు కనిపిస్తోంది. చెమట పడితే తుడవడం, కాస్త సపరియలు చేయడంతో అందరూ కామెంట్ కూడా చేశారు. ఇది కాసేపు పక్కనబెడితే.. నిన్న అభిజీత్-మోనాల్ కాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నట్టు కనిపిస్తోంది.
ఇష్టమైన రంగు, స్థలాలు, పళ్లు ఫలాలు ఇలా ఏదేదో మాట్లాడుకుంటూ మధ్యలో బాయ్ ఫ్రెండ్, పెళ్లి టాపిక్స్ కూడా వచ్చాయి. తనకు ప్రేమ పెళ్లి కంటే పెద్దలు కుదిర్చిన పెళ్లే ఇష్టమని చెప్పింది. పైగా పెద్ద ఫ్యామిలీ ఉండాలి అత్త, మామ, తాత, చెల్లెల్లు ఇలా పెద్దగా ఉండాలని చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి తన ఇంట్లో లేదు కాబట్టి పెళ్లి అయినా పెద్ద ఫ్యామిలీ ఉండేవారిని చేసుకోవాలని అనుకుంటున్నట్టు మనసులో మాట చెప్పేసింది.