బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో మంచి రసవత్తరంగా సాగుతోంది. వారం..వారం ఒక కంటెస్టెంట్ వెళ్లిపోతూ ఉండటంతో పరిణామాలు మారుతున్నాయి. మరోవైపు గొడవలు పెరిగాయి. తాజాగా హౌజ్ మేట్స్ కుటుంబ సభ్యులు రావడంతో హౌస్‌లో కన్నీటి వరద పారింది. ఇలా ఏది ఒక టాపిక్ బిగ్ బాస్ చూడాలన్న ఇంట్రస్ట్ పెంచుతోంది. నిర్వాహకులు కూడా గొడవలనే హైలెట్ చేస్తూ..రేటింగ్ పెంచే పనిలో ఉన్నారు. కాగా బిగ్ బాస్ యాజమాన్యం కావాలనే ఓ కంటెస్టెంట్‌ను బయటకు పంపాలని డిసైడయిన్లు ప్రచారం జరుగుతోంది. అయితే, కొన్ని కొన్ని పరిణామాల కారణంగా ఈ షోపై అనుమనాలను పెంచుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఓట్ల ప్రకారం కాకుండా బిగ్ బాస్ ఎవర్నీ ఎలిమినేట్ చేయబోతున్నారో నెటిజన్లు ముందుగానే చెప్పేస్తున్నారు.
ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఎంత ఘర్షణ వాతావరణం నెలకుందో అందరం చూశాం. అభిజిత్ -అఖిల్ మధ్య మాటల వార్ నడిచింది. అయితే ఎప్పుడూ జరిగే తంతే. కానీ, మరో ఎండ్‌లో హారిక – సోహెల్ రియాన్ మధ్య జరిగిన ఓ రేంజ్‌లో జరిగింది. ఇద్దరూ హద్దుమీరి ప్రవర్తించారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. సోహెల్ పరిధి దాటి బాడీ షేమింగ్ చేశాడు. దీంతో అతడిపై నెటిజన్లు ఫైరవుతున్నారు. ఒక అమ్మాయితో మాట్లాడి పద్దతి ఇది కాదు అంటూ నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు.
వాస్తవానికి హారికతో గొడవ జరిగిన తర్వాతి రోజే సోహెల్ ఆమెకు క్షమాపణ చెప్పాడట. అప్పటి నుంచి ఇద్దరూ బానే మాట్లాడుకుంటున్నారు. కానీ, వీటిని షోలో ఎక్కడా చూపించలేదు. ఈ విషయాలను సోహెల్.. అఖిల్‌తో చెప్పడంతో అందరికీ తెలిసింది. దీంతో అతడిని కావాలనే బ్యాడ్ చేస్తున్నారని షో నిర్వహకులపై సోహెల్ మద్దతుగా నిలిచే వర్గం ఆరోపిస్తోంది. దేవీ నాగవల్లీ, కుమార్ సాయి, దివిని పంపించినట్లు సోహెల్ ను కూడా పంపడానికి మాస్టర్ ప్లాన్ సిద్దం చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సింగరేణి బిడ్డను కాపాడేందుకు ఆ ప్రాంతం వాసులు గట్టిగా ఓట్లు వేయిస్తున్నప్పటికీ, బిగ్ బాస్ తలుచుకుంటే ఎలిమినేషన్ తపదన్న విషయం తెలిసిందే. లెట్స్ వెయిట్ అండ్ సీ.