బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతుంది. కాకపోతే ఎప్పుడు అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉన్నది. నిజానికి ఈ షో ఈనెల 30న ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. కంటెస్టెంట్లలో ఒకరి కరోనా రావడంతో షో వాయిదా పడింది. సెప్టెంబర్ 5 న మళ్లీ ప్రారంభం అవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ.. ఏ వార్తల్లోనూ నిజం లేదు. బిగ్ బాస్ యాజమాన్యం నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇక.. అసలు విషయానికి వస్తే.. బిగ్ బాస్ షో సిబ్బందిపై నాగార్జున సీరియస్ గా ఉన్నారట. బిగ్ బాస్ షోకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతుండటంతో నాగార్జునకు చిర్రెత్తుకొచ్చిందట. దీంతో నిర్వాహకులపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేసినట్టు తెలుస్తోంది.
షో ప్రారంభం కావడానికి కొద్దిరోజులే మిగిలి ఉండటంతో.. ఇప్పటికే కంటెస్టెంట్ల ఏవీలు, ప్రోమోల షూటింగ్ లు, కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లే షూటింగులు అన్నీ పూర్తవ్వాల్సి ఉంది. కానీ.. వీటి షూటింగ్ లో చాలా సమయం పడుతుండటంతో ఆయన కోపానికి గురయినట్టు తెలుస్తోంది.
అరియానా గ్లోరీ అనే యాంకర్ కంటెస్టెంట్ల లిస్టులో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె హౌస్ లోకి వెళ్లే సీన్ ను, ఫేమస్ యూట్యూబర్ మహబూబ్ దిల్ సే హౌస్ లోకి వెళ్లే సీను.. ఈ రెండింటికీ ఒకరోజు సమయం పెట్టుకున్నా… ఒకరోజు మొత్తం అరియానా షూటింగ్ కోసమే కేటాయించారట. ఇంత నెమ్మదిగా పనులు చేస్తే ఎలా షో ముందుకు వెళ్లేది.. అంటూ నాగ్.. నిర్వాహకులపై సీరియస్ అయ్యారట.
దానితో పాటుగా కరోనా వైరస్ బిగ్ బాస్ హౌస్ లో విస్తరించకుండా… సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షోను నడిపించాలని.. లేకపోతే షో ఆగం అయిపోయే ప్రమాదం ఉందని నాగ్ ముందే నిర్వాహకులకు హెచ్చరించారట.