బిగ్ అప్డేట్ : “వారసుడు” ఓటిటి రిలీజ్ కి రెడీ.!

కోలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ లో సీనియర్ స్టార్ హీరో విజయ్ కూడా ఒకడు. మరి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమానే “వారసుడు”. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తో విజయ్ మొదటిసారిగా వర్క్ చేయగా ఈ సినిమా అనూహ్య విజయాన్ని తెలుగు మరియు తమిళ్ భాషలో నమోదు చేసింది.

అంతే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సత్తా చాటగా ఇప్పుడు అన్ని చోట్లా థియేట్రికల్ రన్ ని ముగించుకుంది. ఇక ఈ అవైటెడ్ సినిమా అయితే ఇప్పుడు ఓటిటి లో సందడి చేసందుకు సిద్ధం అయ్యింది. గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఉండగా.. 

మొత్తానికి ఈ బిగ్ అప్డేట్ దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ రివీల్ చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ “వారసుడు” అలాగే తమిళ్ వెర్షన్ “వారిసు” మాత్రమే కాకుండా అదనంగా మరో భాష మలయాళంలో కూడా ఈ సినిమాని ప్రైమ్ వీడియో సంస్థ ఈ ఫిబ్రవరి 22 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకురాబోతున్నట్టుగా ఆ బిగ్ అప్డేట్ ని ఇప్పుడు అందించారు.

ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీకాంత్, ఎస్ జె సూర్య, జయసుధ లాంటి బిగ్ స్టార్స్ కూడా నటించారు. అలాగే థమన్ ఎస్ సంగీతం సమకూర్చాడు.