ఈ ఏడాది ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసిన పలు భారీ హిట్ చిత్రాల్లో గత ఆగష్టు లో వచ్చిన సెన్సేషనల్ మల్టీ స్టారర్ చిత్రం “జైలర్” కూడా ఒకటి. తమిళ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ అలానే కన్నడ నుంచి సీనియర్ నటుడు శివన్న శివ రాజ్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ తెరకెక్కించారు.
మరి ఒక్క తెలుగు నుంచే ఏకంగా 100 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం రజిని కెరీర్ లో మరో పెద్ద హిట్ గా అయితే నిలిచింది. ఇలా ఎన్నెన్నో బిగ్గెస్ట్ రికార్డ్స్ సెట్ చేసిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ అంటూ జస్ట్ కొన్ని రోజులు కితమే షాకింగ్ బజ్ రాగా ఇప్పుడు దీనిపై మరో ట్విస్ట్ తో సినిమా రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది.
ఇది వరకు అయితే ఈ చిత్రం సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కి వస్తుంది అని టాక్ రాగా ఇపుడు ఈ సినిమా అఫీషియల్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానున్నట్టుగా వారు కన్ఫర్మ్ చేశారు. కాగా దీనితో పాటుగా ఈ చిత్రం తమిళ్, తెలుగు కన్నడ మలయాళం సహా హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ ఆగస్ట్ 7 నుంచే వచ్చేస్తుంది అని కన్ఫర్మ్ చేశారు.
ఇది షాకింగ్ అని చెప్పాలి ఈ సినిమా ఆగస్ట్ 10న రిలీజ్ అయితే నెల తిరక్కుండానే వచ్చేస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం అయితే ఫుల్ హెచ్ డి ప్రింట్ తమిళ్ లో లీక్ అవ్వడం వల్లే అని తెలుస్తుంది. ఇప్పటికే ఎంతో లాభాలు వచ్చేసాయి. సో ఇప్పుడు ఓటిటి కి వచ్చినా పెద్ద నష్టం అయితే లేదు అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో తమన్నా, సునీల్ లు కూడా నటించగా అనిరుద్ క్రేజీ మ్యూజిక్ అందించాడు.