బిగ్ అప్డేట్ : థలపతి విజయ్ 68 కోసం చైతు డైరెక్టర్.!

కోలీవుడ్ సినిమా దగ్గర మైండ్ బ్లాకింగ్ క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో థలపతి విజయ్ కూడా ఒకరు. మరో ఒకప్పుడు తెలుగు నుంచి రెండు మూడు సినిమాలు కలిపితే ఓ సినిమా చేసే స్టేజి నుంచి ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గరే భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా నిలిచాడు.

ఇక ఇప్పుడు తాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో “లియో” సినిమా చేస్తుండగా ఈ సినిమాకి సెన్సేషనల్ హైప్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ఉంది. కాగా ఈ సినిమా తర్వాత అయితే విజయ్ కెరీర్ లో 68వ సినిమాని ఇప్పుడు వీకెండ్ బ్లాస్ట్ గా అనౌన్స్ చేసేసారు మేకర్స్.

కాగా ఈ చిత్రాన్ని నాగ చైతన్య నటించిన రీసెంట్ డిజాస్టర్ “కస్టడీ” దర్శకుడు వెంకట్ ప్రభు అయితే ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నట్టుగా ఇపుడు ఫిక్స్ అయ్యింది. మరి దీనిపై అయితే రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “ఓజి” కి సుజీత్ పై రిలీజ్ చేసిన ఓ అనౌన్సమెంట్ వీడియో టైప్ లో ఓ వీడియో ని రిలీజ్ చేయగా..

అందులో ఒకోకరు పేరు తో అయితే ఈ సినిమాని ఫిక్స్ చేసారు. ఇక ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందివ్వనున్నాడు. ఇక ఈ సినిమాతో అయితే తన కల నెరవేరుతుంది అని దర్శకుడు వెంకట్ ప్రభు ట్వీట్ చేసాడు. కాగా ఈ చిత్రాన్ని అయితే ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. అయితే వెంకట్ విజయ్ కోసం ఓ ఊహించని బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నట్టుగా కొన్ని రూమర్స్ ఉన్నాయి.