బిగ్ అప్డేట్ : విజయ్ సినిమా ప్రకటనతో సంక్రాంతి యుద్ధం కి రెడీ.!

ఇంకా వచ్చే ఏడాది సంక్రాంతి బరికి ఒక్క నెల మాత్రమే మిగిలి ఉంది. ఆల్రెడీ 2022 లో డిసెంబర్ కి వచ్చేసాం ఇక జనవరి వస్తే సినిమా పరిశ్రమలో అదిరే పోరుకి అంతా సిద్ధం అయితే, ఈసారి సంక్రాంతి టాలీవుడ్ సహా కోలీవుడ్ లో కూడా రసవత్తరంగా మారడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది.

తెలుగులో చిరు బాలయ్య లాంటి స్టార్స్ తో తమిళ్ హీరో విజయ్ కూడా తన సినిమా “వారుసుడు” తో రాబోతున్నాడు. అయితే ఈ సంక్రాంతికి అనౌన్స్ చేసిన సినిమాలు వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి లు డేట్స్ ఇంకా అనౌన్స్ చెయ్యలేదు అలాగే విజయ్ సినిమా కూడా ఇన్ని రోజులు అనౌన్స్ చేయలేదు.

కానీ ఫైనల్ గా మొదటిసారి డేట్ ని విజయ్ సినిమానే అనౌన్స్ చేసి సంక్రాంతి యుద్దానికి డేట్ ప్రకటించింది. మరి ఓవర్సీస్ డిస్ట్రిబూస్టర్స్ ఇచ్చిన అప్డేట్ తో అయితే ఈ చిత్రం జనవరి 12న డేట్ ని లాక్ చేసుకుంది. ఇక దీనితో నెక్స్ట్ ఇతర సినిమాల డేట్స్ అనౌన్స్ కావాల్సి ఉన్నాయి.

దిల్ రాజు నుంచి అయితే ఓ క్లారిటీ వచ్చేయగా ఇప్పుడు ఇప్పుడు అందరు మిగిలి ఉన్న సినిమాల డేట్స్ కోసం చూస్తున్నారు. దీనితో పోటీ ఏ స్థాయికి వెళ్తుందా అని అంతా అంచనా వేయొచ్చు. మరి ఈ సినిమాలో రష్మికా అయితే హీరోయిన్ గా నటిస్తుండగా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకతం వహిస్తున్నాడు.