బిగ్ అప్డేట్ : అల్లు అర్జున్ తో కూడా సందీప్ అలాంటి సినిమానే??

రానున్న రోజుల్లో ఇండియన్ సినిమా దగ్గర మార్కెట్ మరింత లెవెల్లో షేప్ అవుట్ కానుంది. ఒకో టాప్ దర్శకుడితో అనేకమంది స్టార్ హీరోస్ కోలాబ్ అయ్యి సినిమాలు చేస్తూ ఉండడంతో ఫ్యాన్స్ లో అంతకంతకు ఉత్సుకత పెరుగుతూ వస్తుండగా ఈ సెన్సేషనల్ కాంబినేషన్స్ లో అయితే ఇప్పుడు సెన్సేషనల్ గా మారుతున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ లు కూడా ఒకటి.

కాగా ఈ సినిమా ఎపుడో అనౌన్స్ అయ్యింది కానీ సెట్స్ మీదకి వెళ్లేందుకు చాలా సమయం తీసుకుంటుంది. అయితే ఈ సినిమా అనౌన్స్ అయ్యింది తప్ప ఇంకా మరే ఇతర అప్డేట్ లేదు. కానీ ఈరోజు నిర్మాణ సంస్థ టి సిరీస్ ఇచ్చిన ఓ అప్డేట్ లో చూసినట్టు అయితే అల్లు అర్జున్ తో సినిమా ఎలా ఉంటుందో అనేది అర్ధం అవుతుంది.

కాగా ఇందులో అల్లు అర్జున్ సాగా అంటూ వారు మెన్షన్ చేశారు. అంటే ఈ సినిమా కూడా పార్టులుగా ఉంటుంది అనేది అర్ధం అవుతుంది. అయితే ఇది అల్లు అర్జున్ సినిమాకే చెప్పినట్టుగా చాలా మంది అనుకుంటున్నారు. చాలా మంది దర్శకుడు సందీప్ తో నిర్మాణ సంస్థ చేసే సినిమాలు వరుసగా చెప్పారు.

కాబట్టి సాగా అని మెన్షన్ చేశారు అనుకోవచ్చు. కానీ అక్కడ ‘అన్ అల్లు అర్జున్ సాగా’ అనేది మనం చూడొచ్చు. దీనితో అల్లు అర్జున్ తో కూడా ఫ్రాంచైజ్ లాంటిది సందీప్ ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. మరి బిగ్గెస్ట్ కాంబినేషన్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.