బిగ్ సర్‌ప్రైజ్ : రాజమౌళి కోరిక మేరకు ఆర్ ఆర్ ఆర్ లో మెగాస్టార్ చిరంజీవి ..?

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టేశారు. కోవిడ్ వల్ల దాదాపు 7 నెలలు షూటింగ్ ఆగిపోయిన ఆర్ ఆర్ ఆర్ మీద భిన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి. చెప్పాలంటే పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా వినిపించాయి. కాని అనూహ్యంగా జక్కన్న అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ చేయడమే కాకుండా ఎన్.టి.ఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన రాజరాజు ఫర్ భీమ్ టీజర్ ని రిలీజ్ చేసి అందరు అనుకుంటున్న కామెంట్స్ కి ఒకే ఒక్క సమాధానం ఇచ్చాడు.

RRR Motion Poster: Ram Charan and NTR join forces as fire and water in  'Roudram Ranam Rudhiram' | Telugu Movie News - Times of India

అంతేకాదు మధ్య మధ్యలో ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తు అటు మెగా అభిమానులకి ఇటు నందమూరి అభిమానులకి సర్‌ప్రైజ్ ఇస్తున్నాడు. కాగా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి కూడా భాగం కాబోతున్నట్టు సమాచారం. అయితే అది సిల్వర్ స్క్రీన్ మీద కాదు. స్క్రీన్ వెనకాల ఉండి ఎన్.టి.ఆర్ – రాం చరణ్ పాత్రలని పరిచయం చేయనున్నారట. అంటే ఆర్ ఆర్ ఆర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడని అర్థం.

ఇప్పటికే మెగాస్టార్ రానా నటించిన ఘాజీ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. కథ ని నడిపించేందుకు మెగాస్టార్ వాయిస్ బాగా ప్లస్ అయింది. అలాగే ఆర్ ఆర్ ఆర్ కి మెగాస్టార్ తో వాయిస్ ఓవర్ చెప్పించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అంతేకాదు బాలీవుడ్ లోనూ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఎన్.టి.ఆర్ – రాం చరణ్ పాత్రలని పరిచయం చేయనున్నాడని సమాచారం. ఇదే గనక నిజమైతే ఆర్ ఆర్ ఆర్ కి మరో స్పెషల్ అట్రాక్షన్ యాడ్ అయినట్టే అంటున్నారు.