Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచిగా సక్సెస్ అందుకున్న వారిలో నటి సమంత ఒకరు. ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు అయితే ఇటీవల కాలంలో సమంత తన వ్యక్తిగత విషయాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కారణంగా సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నారు.
ఇక ఈమె సినిమాలకు కమిట్ అవుతున్న కూడా ఎక్కువగా వెబ్ సిరీస్ లకే కమిట్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో సమంత ఖుషి సినిమా తరువాత ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులు సమంతను బాగా మిస్ అవుతున్నారని చెప్పాలి. ఇదిలా ఉండగా సమంతకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సమంతను ఓ బడా ప్రొడ్యూసర్ కిడ్నాప్ చేశారు అంటూ ఈ వార్త హల్చల్ చేస్తుంది.
సమంత గతంలో ఎన్నో అద్భుతమైన తెలుగు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ క్రమంలోనే సమంత ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రామయ్య వస్తావయ్య. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ ప్రొడ్యూసర్ సమంతను ఏకంగా కిడ్నాప్ చేయించి తన ఫామ్ హౌస్ లో కొద్ది రోజులు బంధించారని తెలుస్తోంది.
ఇలా ఆ ప్రొడ్యూసర్ సమంతను తన ఫామ్ హౌస్ లో బంధించడానికి గల కారణమేంటనే విషయాన్ని వస్తే ఇండస్ట్రీలో ఉండే నిర్మాణ సంస్థలన్నింటిలోనూ సమంత నటిస్తున్నప్పటికీ ఆయన సినిమాలకు మాత్రం నో చెబుతున్న కారణంగానే ఈ పని చేశారని తెలుస్తోంది. అయితే సమంత కిడ్నాప్ గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఈ వార్త సంచలనంగా మారింది అయితే ఈ ప్రొడ్యూసర్ కొడుకు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరో అని తెలుస్తుంది. ఇక ఆ సమయంలోనే సమంత ఇండస్ట్రీకి కూడా చిన్న గ్యాప్ ఇవ్వటంతో ఈ వార్త నిజమేనని పలువురు భావిస్తున్నారు.