టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గ్రాఫి కోసం కానీ అలాగే తన పర్సనల్ లైఫ్ కోసం గాని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా పవన్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా బిజీగా ఉండడంతో పవన్ పై తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి చాలా విషయాల్లో అనేకమార్లు మానసిక ఇబ్బంది పెట్టె ప్రయత్నం ఇన్నేళ్ళలో చాలా సార్లు జరిగింది.
అయితే రీసెంట్ గానే పవన్ మూడో పెళ్లి విషయంలో కూడా సోషల్ మీడియాలో సహా వెబ్ సైట్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున పవన్ పై వెబ్ మానసిక దాడి జరిగింది. దీనితో వెంటనే పవన్ తన భార్య అన్నా తో కలిసి ఉన్న ఒక పిక్ పెట్టి పవన్ పై ఫేక్ ప్రచారాలు చేసిన వారికి చెంపపెట్టు లాంటి సమాధానం అందించగా..
ఆ తర్వాత కూడా దానిని గ్రాఫిక్స్ అంటూ కూడా కొందరు సోషల్ మీడియాలో దాడి ఆపలేదు. మరి పవన్ మూడో పెళ్లి భార్య విడాకులు వల్ల వీరికి ఎంత కాలిందో కానీ పవన్ కి మాత్రం బాగా కాలేలా చేసిన దెబ్బకి ఎప్పుడు ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకోని పవన్ ఇపుడు మాత్రం తమ పార్టీ లీగల్ సెల్ తో కూర్చొని తనపై తన భార్యపై పనిగట్టుకొని ఫేక్ ప్రచారం చేసిన ఏ ఒక్కరినీ వదిలేది లేదు అని అందరిపై కూడా లీగల్ చర్యలు తీసుకోబడతాయి అని తెలిపారు.
అంతే కాకుండా ఆ యూట్యూబ్ ఛానెల్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ సహా పలు వెబ్ సైట్ ప్లాట్ ఫామ్ లను కూడా అధికారికంగా ట్యాగ్ చేసి మరీ చెప్పారు. దీనితో పవన్ నుంచి ఈ నిర్ణయంతో అయితే ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై @JanaSenaParty చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోనుంది.
వీరిలో అధికార @YSRCParty కి చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటుగా, వారి అనుబంధ యూట్యూబ్ ఛానెల్స్, పలు మీడియా సంస్థలపై… pic.twitter.com/c02ioaYqA0
— JanaSena Party (@JanaSenaParty) July 7, 2023