బిగ్ క్లారిటీ..అది “పుష్ప 2” కోసం కాదు ఎన్టీఆర్ కోసమట..డీటెయిల్స్ ఇవే!

ఇప్పుడు తెలుగు స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవెల్లో కన్నేశారు. అందుకే తమ నెక్స్ట్ సినిమాలు ఆల్ మోస్ట్ పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్ చేస్తుండగా ఆ రేంజ్ లోనే మాసివ్ అనౌన్సమెంట్స్ ఇచ్చేసారు. ఇక ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో తమ సినిమాలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన “పుష్ప”, యంగ్ టైగర్ ఎన్టీఆర్ “RRR” లతో సత్తా చాటుకున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు వీరిద్దరూ కూడా వేరువేరుగా పుష్ప 2, ఎన్టీఆర్ 30 సినిమాలతో బిజీగా ఉండగా నిన్న సినీ వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. సుకుమార్ కి తన శిస్యుడు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా స్క్రిప్ట్ లో సహకారం అందిస్తున్నాడని టాక్ బయటకి వచ్చింది.

కానీ అసలు ఇందులో ఇతివృత్తమే వేరు అట. నిజానికి బుచ్చిబాబు సుకుమార్ కి హెల్ప్ చెయ్యడం కాదు బుచ్చిబాబుకి సాయం సుకుమార్ చేస్తున్నాడట. అయితే దీనిపై ఇంకా డీటెయిల్స్ లోకి వెళితే బుచ్చిబాబు నెక్స్ట్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

తారక్ కోసం ఈ యంగ్ దర్శకుడు ఒక రఫ్ స్టోరీ ని తయారు చేసాడని ఆ మధ్య టాక్ బయటకి వచ్చింది. ఇంకా అధికారికంగా అయితే ఈ సినిమా అనౌన్స్ కాలేదు కానీ ఒరిజినల్ గా ఇంకా ఈ సినిమా లైన్ లోనే ఉంది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ కోసం సుకుమార్ తన స్టూడెంట్ బుచ్చిబాబుకి హెల్ప్ చేస్తున్నాడట. ఇది ఇందులో అసలు మేటర్..