బిగ్ ఛేంజ్..”వాల్తేరు వీరయ్య” ఎక్కడ ఆగిందో మళ్ళీ అక్కడేనట.!

megastar_chiranjeevi_waltair_veerayya_trailer-sixteen_nine

ఇప్పుడు సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమా బిగ్గిస్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మాస్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. మరి ఈ చిత్రం దర్శకుడు బాబీ తెరకెక్కించగా ఫైనల్ గా ఇప్పుడు ప్రీ రిలీజ్ కి సినిమా దగ్గరయింది. అయితే ఈ సినిమా ఈవెంట్ కి గాను ఏపీ ప్రభుత్వం మొదట ఆర్ కె బీచ్ వద్ద పర్మిషన్ ఇవ్వని సంగతి తెలిసిందే.

దీనితో ఆల్రెడీ పనులు అక్కడ స్టార్ట్ చేయగా మళ్ళీ అందరూ యూనివర్సిటీ గ్రౌండ్ కి అయితే షిఫ్ట్ చేసారు. అయితే నిన్న మేకర్స్ అనౌన్స్ చేసిన పోస్టర్ లో ఈవెంట్ వేదిక కోసం అప్పుడే రివీల్ చేయలేదు. దీనితో వేదిక మళ్ళీ మారే ఛాన్స్ ఉన్నట్టుగా అనిపించింది.

కానీ ఫైనల్ గా అయితే చిత్ర యూనిట్ నే గెలిచినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. వాల్తేరు వీరయ్య గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నట్టు గానే ఆర్ కె బీచ్ వద్దనే జరగనున్నట్టుగా సినీ వర్గాలు ఇప్పుడు న్యూస్ కన్ఫర్మ్ చేసాయి.

దీనితో వీరయ్య ఎక్కడైతే ఆగాడో మళ్ళీ అక్కడే తన ఈవెంట్ ని జరుపుకుంటున్నాడని చెప్పాలి. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్రలో నటించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అయితే మైత్రి మేకర్స్ నిర్మాణం వహించారు.