బిగ్ బాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. సీజన్ 6 టెలిక్యాస్ట్ డేట్ ఫిక్స్?

టాలీవుడ్ లో బుల్లితెర మీద ప్రసారమైన రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాల్టీ షో మంచి ప్రేక్షకాదరణ పొందింది. దేశంలో అన్ని భాషలలో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో తెలుగులో కూడా బుల్లితెర మీద 5 సీజన్ లను పూర్తిచేసుకొని, ఓటిటిలో ఒక నాన్ స్టాప్ సీజన్ పూర్తి చేసుకుంది. కొంతకాలం క్రితం పూర్తైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో బిందు మాధవి టైటిల్ దక్కించుకొని బిగ్ బాస్ చరిత్రలోనే మొదటి లేడి టైటిల్ విన్నర్ గా గుర్తింపు పొందింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ పూర్తైన సమయం నుండి ప్రేక్షకులు బిగ్ బాస్ 6 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చాలా కాలంగా బిగ్ బాస్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్ లా ఎంపిక కొనసాగుతూనే ఉంది. మరోపక్క బిగ్ బాస్ ఇంటి నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొని కంటెస్టెంట్ల గురించి ఇప్పటికే చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా టెలివిజన్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్లతో పోలిస్తే ఓటీటి లో ప్రసారమైన నాన్ స్టాప్ సీజన్ కి తక్కువ రేటింగ్ వచ్చింది. బిగ్ బాస్ షో ని ఓటిటిలో ప్రసారం చేయటం వల్ల టీవీలలో చూసే ఆడియన్స్ చాలామంది బిగ్ బాస్ షోను చూడలేకపోయారు. దీంతో బిగ్ బాస్ సీజన్ 6 ని టీవిలో ప్రసారం చేయబోతున్నారు. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ అభిమానులు ఆనందించే ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులు ఆనందించేలా బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారం కాబోయే తేదిని ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 4వ తేదీ బిగ్ బాస్ సీజన్ 6 మొదటి ఎపిసోడ్ ప్రారంభం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆగష్టు లో ప్రసారం చేయవలసిన ఈ సీజన్ సెప్టెంబర్ లో ప్రసారం చేయడానికి కూడా ఒక సెంటిమెంట్ ఉంది. గతంలో సెప్టెంబర్ లో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ ఫోర్ కూడా టాప్ రేటింగ్స్ తో మంచి ప్రేక్షకాదరణ పొందింది. అందువల్లే సీజన్ 6 కూడా సెప్టెంబర్ లో ప్రారంభించనున్నారు.