NTR 30 విలన్ రోల్.. చర్చల్లో బిగ్ స్టార్స్?

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టు పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ ప్రాజెక్టులో మిగతా నటీనటుల విషయంలో మాత్రం ఇంతవరకు చిత్ర యూనిట్ సభ్యులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అప్డేట్ కోసమైతే ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కానీ ఎన్టీఆర్ మాత్రం సరైన టైంలో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయి అని మొన్న చాలా కసిగానే క్లారిటీ ఇచ్చాడు. అయితే కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అని భారీ ప్రణాళికలు రచిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ 30వ సినిమాలో విలన్ పాత్ర కోసం చాలా పెద్ద స్టార్స్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే ఇంతకుముందే విశాల్ పేరు చర్చల్లోకి రాగా అందులో ఎలాంటి నిజం లేదు అని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు విజయ్ సేతుపతి పేరు కూడా వినిపిస్తోంది. అలాగే మరో తమిళ హీరో చేయాలని విక్రమ్ కూడా ఇందులో క్రూరమైన పాత్రలో కనిపించబోతున్నాడు అని కథనాలు వెలబడుతున్నాయి.

ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సైఫ్ అలీ ఖాన్ పేరు కూడా వినిపిస్తోంది ఈ ముగ్గురు కూడా దాదాపు హై రేంజ్ లోనే పారితోషికాలు అందుకుంటున్నారు కాబట్టి విలన్ రోల్స్ అంటే అంతకంటే ఎక్కువ అడిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమా కాబట్టి కొరటాల శివ కూడా మొండి పట్టుతో స్టార్ క్యాస్ట్ ను ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఇది ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.