బాక్సాఫీస్ : దుమ్ములేపిన “బిచ్చగాడు 2”..డే 1 తమిళ్ కన్నా తెలుగులోనే ఎక్కువ.!

మన తెలుగు ఆడియెన్స్ కి భాషా బేధం లేకుండా ఏ భాష నుంచి సినిమా అయినా కూడా ఒక్కసారి నచ్చాలి గాని మరున్ నిమిషం దాన్ని తలపై పెట్టుకుంటారు. మీ వాళ్ళు మా సినిమాలు చూడరు అనే కోలీవుడ్ ఆడియెన్స్ మాటని ఎన్నోసార్లు తప్పని ప్రూవ్ చేసి మరోసారి అక్కడ కన్నా మన దగ్గరే లేటెస్ట్ చిత్రం “బిచ్చగాడు 2” కి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ఇచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

కాగా విజయ్ ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ చేయగా తెలుగులో ఏమంత పెద్ద ప్రమోషన్స్ కూడా లేకుండా తమిళ్ కన్నా తెలుగు లోనే ఎక్కువ వసూళ్లు రాబట్టినట్టుగా తెలుస్తుంది. మరి తమిళ్ లో వసూళ్లు చూసినట్టు అయితే సుమారు 3 కోట్ల మేర గ్రాస్ ని రాబట్టగా..

షాకింగ్ గా డబ్బింగ్ సినిమా అయ్యిన దీనికి తెలుగు స్టేట్స్ లో మొదటి రోజు ఏకంగా 4 పైగానే వసూళ్లు రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ చిత్రానికి యూఎస్ లో కూడా తెలుగు వసూళ్లు భారీ మార్జిన్ తో తమిళ్ వసూళ్ల కంటే ఎక్కువ ఉన్నాయట.

ఇక దీనిబట్టి “బిచ్చగాడు 2” ని మన వాళ్ళు ఏ లెవెల్లో అక్కున చేర్చుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ వారాంతంలో అయితే వసూళ్లు మరింత స్ట్రాంగ్ గా వస్తాయని చెప్పడంలో సందేహమే లేదు. కాగా ఈ చిత్రానికి విజయ్ ఆంటోనినే సంగీతం నిర్మాణం వహించగా కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.