మిక్స్డ్ టాక్ తో కూడా “భోళా శంకర్” ఫస్ట్ డే ఊహించని వసూళ్లు.?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “భోళా శంకర్”. అయితే ఈ ఏడాది మొదటి హిట్ “వాల్తేరు వీరయ్య” భారీ సక్సెస్ అనంతరం చిరు నుంచి వచ్చిన రెండో రిలీజ్ ఇది కాగా ఈ చిత్రం రీమేక్ కావడంతో పైగా లాస్ట్ మినిట్ లో కూడా పలు ఇబ్బందులు రావడంతో ఈ చిత్రానికి భారీ హైప్ కాస్త తగ్గింది.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యిన మొదటి షో తోనే నెగిటివ్ టాక్ వచ్చేసింది. దీనితో అసలు ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు మొదటి రోజు అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే అంత దారుణమైన టాక్ తో కూడా ఈ చిత్రం ఊహించని వసూళ్లు నమోదు చేసినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి.

అయితే ఈ సినిమాకి వచ్చిన టాక్ తో ఎలా లేదన్నా 10 కోట్లకి కన్నా తక్కువే షేర్ ని తెలుగు స్టేట్స్ లో అందుకుంటుంది అని అంచనా వేశారు కానీ భోళా శంకర్ దాదాపు 12 కోట్లకి కన్నా ఎక్కువే షేర్ ని అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో భోళా శంకర్ కి పర్వాలేదని వసూళ్లు అది కూడా ఇలాంటి టాక్ తో రావడం ఊహించనిదే అని చెప్పాలి.

అయితే ఇది సినిమా బిజినెస్ లో మాత్రం చాలా తక్కువ ఇంకా మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినా తో కూడా చాలా తక్కువే అని చెప్పాలి. ఈ వీకెండ్ కి పర్వాలేదు ఏమో కానీ ఇక సోమవారం వసూళ్లతో అయితే భోళా శంకర్ పని అయిపోయినట్టే అని చెప్పక తప్పదు.