“భోళా శంకర్” రూమర్స్ పై క్లారిటీ ఇచ్చినట్టేనా.?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఏదైనా ఉంది అంటే అది “భోళా శంకర్” అని చెప్పాలి. ఇది వరకే ఒకే సమయంలో మూడు సినిమాలు చేసిన మెగాస్టార్ ఒకో సినిమా మారుతూ ఈ భోళా శంకర్ కూడా చేశారు. అయితే అప్పటికీ చాలా సినిమా కంప్లీట్ కాగా కేవలం ఈ సినిమా షూట్ కి వచ్చేసరికి మాత్రం బాగా లేట్ అవుతూ వస్తుంది.

దీని ఏప్రిల్ నుంచి ఆగష్టు కి చేరిన ఈ చిత్రం మళ్ళీ వాయిదా అంటూ కొన్ని రోజులు కితం రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అయితే వీటిపై సమాధానంగా నిన్న మే డే కానుకగా ఇచ్చిన కూల్ పోస్టర్స్ లో కన్ఫర్మ్ చేశారు. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా షూటింగ్ డిలే అవుతున్న కారణంగా అయితే మేకర్స్ మరో డేట్ ని చూస్తున్నారని వచ్చింది.

కానీ లేటెస్ట్ పోస్టర్స్ లో రిలీజ్ ని కూడా యాడ్ చేయడంతో అయితే ఈ సినిమా రిలీజ్ ప్రస్తుతానికి ఇంకా ఆగష్టు లోనే ఉందని చెప్పొచ్చు. మరి ఇదే డేట్ కన్ఫర్మ్ గా ఉంటుందా లేక వేరే డేట్ ని మళ్ళీ కొత్త డేట్ ని మారుస్తారా అనేది చూడాలి.

ఇక ఈ సినిమాలో మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే యంగ్ హీరో సుశాంత్ నటిస్తున్నాడు. అలాగే మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే రీసెంట్ గా భారీ డిజాస్టర్ అందుకున్న నిర్మాత అనీల్ సుంకర నిర్మాణం వహిస్తున్నారు.