ఈ ఏడాది స్టార్టింగ్ లో మినహా ఇక నెక్స్ట్ ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చిన పెద్ద చిత్రాలు అన్నీ కూడా ఆల్ మోస్ట్ బాక్సాఫీస్ దగ్గర విఫలం అవుతున్నాయి.. వాటిలో లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో నిలవగా ఇక నెక్స్ట్ అయితే తన అన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన “భోళా శంకర్” నిలిచింది.
అయితే ఈ బ్రో సినిమా క్లాస్ గా ఉంది కాబట్టి పెద్దగా రాణించలేదు. కాగా భోళా మాస్ సినిమా అయినప్పటికీ కూడా చాలా దారుణమైన ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇక పైగా రజినీకాంత్ “జైలర్” గట్టి పోటీ ఇవ్వడంతో భోళా తేలిపోయినట్టు అయ్యింది. దీనితో భోళా శంకర్ కి భారీ నష్టాలు తప్పవని అంతా ప్రిపేర్ అయిపోయారు.
అయితే ఇప్పుడు కొన్ని వార్తలు భోళా శంకర్ నిర్మాతపై వస్తున్నాయి. చిరు తన డబ్బులు సెటిల్ చేయమంటున్నారు అని అనిల్ సుంకర చేసేది ఏమి లేక తన స్థలాలు అమ్ముకుంటున్నాడు అని ఏవేవో రాస్తున్నారు. అయితే అసలు ఈ వార్తల్లో ఎలాంటి నిజం కూడా లేదట.
పైగా నష్టాలు వచ్చినా అనీల్ సుంకర కి ఎలాంటి ఫరక్ పడదు అని అనీల్ ఆర్ధికంగా చాలా స్ట్రాంగ్ దీనితో తాను భోళా నష్టాలు వచ్చినా తనకి పెద్ద ఎఫెక్ట్ కాదు అని సినీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ముఖ్యంగా మెగాస్టార్ తన డబ్బులు కావాలని స్ప్రెడ్ చేస్తున్న రూమర్స్ లో అయితే ఎలాంటి నిజం లేదని మెగా ఫ్యామిలీ కి చెందిన కొన్ని ట్రస్టడ్ సోర్సెస్ చెబుతున్నాయ్. వీటితో కావాలనే మెగా ఫ్యామిలిపై కొందరు విషం చిమ్ముతున్నారు అని అలాంటివి నమ్మొద్దు అని చెప్తున్నారు.