ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేసిన చిరు “భోళా శంకర్”.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన బిగ్గెస్ట్ అండ్ క్లీన్ హిట్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటించిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే. దీనితో ఈ సినిమా హిట్ ఎఫెక్ట్ లో మెగాస్టార్ చేస్తున్న నెక్స్ట్ యాక్షన్ రీమేక్ “భోళా శంకర్” కి బాగా ప్లస్ అయ్యింది.

రీమేక్స్ ని బాగా హ్యాండిల్ చేయగలిగే దర్శకుల్లో ఒకరైన దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది. ఎప్పుడో తమిళ్ లో వచ్చిన వేదాళం కి రీమేక్ గా దీనిని తెరకెక్కిస్తుండగా ఇప్పుడు మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.

దీనితో అయితే ఈ సినిమా ఇప్పుడు డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసినట్టుగా తెలిపారు. ఇక దీనితో అయితే సినిమా ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేసినట్టే అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరు కి చెల్లెలి పాత్రలో నటిస్తుంది.

అలాగే యంగ్ హీరో సుశాంత్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది ఆగష్టు 11 న అయితే ఈ సినిమా భారీ లెవెల్లో రిలీజ్ కానుంది.