భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ లో అయితే చాలా బిజీగానే కనిపిస్తోంది. కానీ సినిమాపై అనుకున్నంత స్థాయిలో అయితే అంచనాలు పెరగడం లేదు. అసలు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఫాన్స్ లో కూడా పెద్దగా హైప్ క్రియేట్ కాలేదు. తమిళంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమా గానే ఓ మోస్తారుగా సక్సెస్ అయిన వెదళం కథను అటు ఇటుగా మార్చేసి దర్శకుడు మెహర్ రమేష్ చిరంజీవిని బాగానే ఒప్పించాడు.
శక్తి షాడో లాంటి డిజాస్టర్ అందుకున్న తర్వాత కూడా రమేష్ పై మెగాస్టార్ ఎందుకు అంత నమ్మకంగా ఉన్నారు అనేది ఎవరికి అర్థం కాలేదు. తప్పకుండా భోళా శంకర్ సినిమా సక్సెస్ అవుతుంది అని మెగాస్టార్ కాన్ఫిడెన్స్ తోనే కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన కూడా ముందుగా ఆ ప్రభావం పడేది రమేష్ పైనే.
ఎందుకంటే శక్తి సినిమా తర్వాతనే అతనితో సినిమా చేసేందుకు చాలా మంది వెనుకడుగు వేశారు. అదృష్టం కొద్ది వెంకటేష్ షాడో సినిమా చేశాడు. ఇక అది డిజాస్టర్ కావడంతో మళ్లీ అతనికి ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. అయితే మెగాస్టార్ మాత్రం పాత బంధుత్వంతో మెహర్ రమేష్ కు ఒక గోల్డెన్ ఛాన్స్ అయితే ఇచ్చాడు.
అయితే ఈ సినిమాపై దర్శకుడు మాత్రమే కాకుండా తమన్నా కూడా ఆశలు గట్టిగానే పెట్టుకుంది. కమర్షియల్ గా ఈ బ్యూటీ సక్సెస్ చూసి చాలాకాలం అయింది. కాబట్టి తప్పనిసరిగా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిర్మాత అనిల్ సుంకర కూడా ఏజెంట్ తో పోయిన డబ్బును దీంతో వెనక్కి తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. మరి వీరికి భోళా శంకరుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో చూడాలి.