మిల్కీ బ్యూటీపై అదిరే ఇన్ఫో ఇచ్చిన “భోళా శంకర్” దర్శకుడు.!

ఇక ఈ జూలై నుంచి వరుసగా మెగా ఫ్యాన్స్ కి నెక్స్ట్ మూడు నెలలు మంచి పండుగే అని చెప్పాలి జూలై లో బ్రో తో మొదట పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లు పలకరించనుండగా నెక్స్ట్ ఆగష్టు లో మెగాస్టార్ నటిస్తున్న ఎంటర్టైనర్ కం ఏక్షన్ డ్రామా “భోళా శంకర్” ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.

ఇప్పుడు అన్ని పనులు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదటగా ఫినిష్ చేసిన మేకర్స్ మొదట మెగాస్టార్ డబ్బింగ్ ని కంప్లీట్ చేశారు. ఇక మొన్ననే ఈ యంగ్ హేవ్ సుశాంత్ కూడా కంప్లీట్ చేసాడు. ఇక ఇప్పుడు దర్శకుడు మెహర్ రమేష్ స్వయంగా హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా పై అయితే అదిరే అప్డేట్ ని అందించారు.

ఈ సినిమాకి ఇప్పుడు తమన్నా తన ఫైనల్ వర్క్ గా ఆమె డబ్బింగ్ ని కంప్లీట్ చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ సినిమాలో తమన్నా మెగాస్టార్ తో కలిసి చేసిన రొమాన్స్ సహా ఎంటర్టైనింగ్ సన్నివేశాలు గ్లామరస్ రోల్ తో అయితే అదరగొట్టేసింది అని దర్శకుడు చెప్తున్నాడు.

మరి ఇప్పటికే వచ్చిన పాటల్లో పోస్టర్స్ లో వారి కెమిస్ట్రీ బాగుంది అని అనిపిస్తుంది. ఇక ఫుల్ లెంగ్త్ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. కాగా ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా అనిల్ సుంకర నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఆగష్టు 11న ఐతే సినిమా విడుదల కాబోతుంది.