భోళా శంకర్.. మెగాస్టార్ వల్లే అన్ని క్లియర్

మెగాస్టార్ భోళా శంకర్ మూవీ నేడు థియేటర్స్ లోకి రానుంది. అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా భోళా శంకర్ ని దర్శకుడు మెహర్ రమేష్ సిద్ధం చేశారు. వేదాళం రీమేక్ అయినా మెజారిటీ సీన్స్ చేంజ్ చేయడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. భోళా శంకర్ మూవీపై మెగా ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి.

ఇదిలా ఉంటే రిలీజ్ కి ముందు రోజు భోళా శంకర్ కి కొత్త చిక్కులు వచ్చాయి. ఏజెంట్ వైజాగ్ డిస్టిబ్యూటర్ సతీష్ భోళా శంకర్ మూవీ రిలీజ్ కాకుండా స్టే విధించాలని కోర్టుని ఆశ్రయించారు. నిర్మాత అనిల్ సుంకర తన దగ్గర ఏజెంట్ మూవీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రైట్స్ ఇస్తానని 30 కోట్లు తీసుకున్నాడని, అయితే తరువాత వైజాగ్ రైట్స్ మాత్రమే ఇచ్చారని పిటీషన్ లో పేర్కొన్నారు.

ఏజెంట్ మూవీ ఫ్లాప్ కారణంగా నిర్మాత తనకి అండర్ టేకింగ్ లెటర్ తో పాటు నష్టపరిహారం ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. సామజవరగమన వైజాగ్ రిలీజ్ హక్కులు ఇచ్చారని, దాని ద్వారా తనకి లాభాలు వచ్చిన నష్టపోయిన మొత్తం రాలేదని అన్నారు. అయితే ఇప్పుడు భోళా శంకర్ రైట్స్ తనకి ఇవ్వలేదని, అలాగే నష్టపరిహారం కూడా ఇవ్వకుండా మొహం చాటేశారు అంటూ ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే ఏజెంట్ మూవీ రిలీజ్ పై స్టే విధించాలని కోర్టుని ఆశ్రయించారు. దీనిపై మొన్నటివరకు విచారణ జరిపిన కోర్టు సతీష్ వేసిన పిటీషన్ ని కొట్టేసింది. అలాగే భోళా శంకర్ రిలీజ్ క్లియర్ పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఈ సినిమా రిలీజ్ పై నెలకొన్న నీలినీడలు వీడిపోయాయి. యధావిధిగా భోళా శంకర్ ఈ రోజు ఉదయం షోతో ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే మెగాస్టార్ ఈ మ్యాటర్ లోకి ఇన్వాల్వ్ అయిన తరువాతేనే అంతా క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

ఇక ఏపీలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సరైన పత్రాలు లేని కారణంగా టికెట్ పెంపు రిక్వస్ట్ ని రిజక్ట్ చేసింది. దీంతో పాత ధరలలోనే ఏపీలో భోళా శంకర్ థియేటర్స్ లోకి రాబోతోంది. జైలర్ సినిమాకి అయితే ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు మెగాస్టార్ చిత్రానికి ఎలాంటి స్పందన పబ్లిక్ నుంచి వస్తుందనేది చూడాలి