పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘భీమ్లానాయక్’ సినిమాలో రానా దగ్గుబాటి భార్యగా నటించింది అందాల భామ సంయుక్త మీనన్. ‘బింబిసార’, ‘సార్’ తదితర సినిమాల్లోనూ ఈ బ్యూటీ నటించిన సంగతి తెలిసిందే. ‘విరూపాక్ష’ సినిమాలో కూడా సంయుక్త మీనన్ హీరోయిన్.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్‌తో సంయుక్త మీనన్ మరో సినిమా చేయబోతోందిట. అయితే, అది ‘ఉస్తాద్ భగత్ సింగ్8 అవుతుందా.? ‘ఓజీ’ అవుతుందా.? అన్నదే సస్పెన్స్.
ఈ రెండు సినిమాలకీ శ్రీలీల పేరు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, హీరోయిన్ కాదు.. సంయుక్త మీనన్‌ని ఓ కీలక పాత్ర కోసం అప్రోచ్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ‘ఓజీ’ సినిమా కోసమేనన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.
అయితే, ఈ విషయమై సంయుక్త మీనన్ ఇంతవరకు పెదవి విప్పలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘వినోదియ సితం’ రీమేక్ కూడా షూట్ దశలో వుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ సినిమాలు సెట్స్ మీదకు వెళ్ళాల్సి వుంది.