ఓరీ దేవుడా ఇద్దరూ కలిసి చంపేశారు.. భాను శ్రీ మళ్లీ ఎంటరైంది!!

Bhanu Sri Vishnu Priya Dance Performance In Zee Telugu Dasara Event

అదిరింది షోకు రిపేర్లు చేసి బొమ్మ అదిరిందిగా మార్చిన సంగతి తెలిసిందే. బొమ్మ అదిరింది అంటూ మార్పులు చేర్పులు చేసిన తరువాత షో ఓ రేంజ్లో వర్కవుట్ అయింది. మొదటి ఎపిసోడ్‌తోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ములేపింది. ఇక అయితే ఇందులో మాత్రం యాంకర్లుగా భాను శ్రీ, రవిలను పీకేశారు. జడ్జ్‌గా నవదీప్‌ను తీసేశారు. వీరికి బదులుగా జానీ మాస్టర్‌ను జడ్జ్‌గా, శ్రీముఖిని యాంకర్‌గా పట్టుకొచ్చారు.

Bhanu Sri Vishnu Priya Dance Performance In Zee Telugu Dasara Event

మొత్తానికి భాను శ్రీని అలా తీసేయడంతో బాగానే హర్ట్ అయినట్టు కనిపిస్తోంది. కానీ మధ్యలో తన ఫ్యాన్స్ అదిరిందిలో కనిపించాలనే కోరినను వ్యక్తం చేయడం, వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనకు కూడా మళ్లీ అదిరిందిలోకి వెళ్లాలనే కోరిక ఉన్నట్టు బయటపెట్టేసింది. అయితే తాజాగా దసరా ఈవెంట్‌లో గ్రాండ్‌గా ఎంట్రీఇచ్చింది. అసలే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Bhanu Sri Vishnu Priya Dance Performance In Zee Telugu Dasara Event

తాజాగా భాను శ్రీ విష్ణు ప్రియ కలిసి రచ్చ చేసిన ప్రోమో తెగ వైరల్ అవుతున్నాయి. కనకవ్వ పాడిన ఆడనెమలి అనే పాటకు అదిరిపోయే స్టెప్పులను వేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వీరిద్దిరి స్టెప్పులకు స్టేజ్ మొత్తం దద్దరిల్లింది. ఇలా భాను శ్రీ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో కలరింగ్ కూడా తక్కువేమీ లేదని తాజా ప్రోమోతో ప్రూవ్ అయింది. మొత్తానికి ప్రోమోలతోనే అంచనాలు పెంచేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=XB_3Q37vYbo&feature=youtu.be