బాక్సాఫీస్ : “భగవంత్ కేసరి” ప్రస్తుత వరల్డ్ వైడ్ వసూళ్లు.. 

ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కి వచ్చిన టాలీవుడ్ చిత్రాల్లో అయితే టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం “భగవంత్ కేసరి” కూడా ఒకటి. కాగా బాలయ్య హీరోగా కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించగా..

యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా ఓ కీలక పాత్రలో నటించింది. అయితే ఈ చిత్రం భారీ హిట్ అయినట్టుగా మేకర్స్ ఎప్పటికపుడు భారీ నంబర్స్ ను ఇప్పటికీ అనౌన్స్ చేస్తున్నారు. దీనితో వారే అఫీషయల్ సినిమా నంబర్స్ చెప్తున్నప్పుడు భగవంత్ కేసరి వసూళ్లు విషయంలో ఎవరూ ఏమి మాట్లాడ్డానికి లేదు.

కాగా అలా ఇప్పుడు  ఎంటర్ అయ్యిన ఈ చిత్రం అయితే నిన్నటివరకు 135.73 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలిపారు. అంటే సుమారు 68 కోట్ల మేర షేర్ ని భగవంత్ కేసరి ఇప్పటివరకు అందుకుంది. అయితే ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం ఇంకా ఈ చిత్రం 5 కోట్లకి పైగా రాబడితే అప్పుడు సేఫ్ జోన్ లోకి వెళ్తుంది.

లేకపోతె కొంచెం నష్టాలు తప్పవు. మరి భగవంత్ కేసరితో కూడా బాలయ్య లాభాలు అందించిన హ్యాట్రిక్ ప్రాఫిట్ చిత్రాలు ఉన్న హీరోగా మారుతాడా లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ ఎస్ బాలయ్యకి హ్యాట్రిక్ సంగీతం అందించాడు. దీనితో ఈ సినిమా వారికి మరింత స్పెషల్ గా మారింది.