“భగవంత్ కేసరి” రిలీజ్ అక్కడ కూడా ప్లాన్ చేసి ఆపేశారా?

ఇప్పుడు ఆల్ మోస్ట్ అన్ని సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. అయితే యంగ్ హీరోలు ఈ విషయంలో బాగా అడ్వాన్స్ గా ఉన్నారు కానీ సీనియర్ హీరోస్ అయితే ఈ ట్రెండ్ నెమ్మదిగా స్టార్ట్ చేశారు. కాగా రీసెంట్ గా టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం భగవంత్ కేసరి తన కెరీర్ లో మరో పెద్ద హిట్ అయ్యిన సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం కేవలం తెలుగు భాషలోనే రిలీజ్ అయ్యింది. కానీ సీన్ కట్ చేస్తే ఈరోజు ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో ఓటిటి లో అయితే వచ్చింది. ఇదిలా ఉండగా ఈ చిత్రం విషయంలో బాలయ్య లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ నిజాన్ని అందించడం జరిగింది. జెనరల్ గా హిందీ డబ్బింగ్ విషయంలో ఆల్ మోస్ట్ అన్ని సినిమాలకి డబ్బింగ్ ఇతర ఆర్టిస్ట్ లతోనే చేసేస్తారు.

కానీ భగవంత్ కేసరి సినిమాని హిందీలో రిలీజ్ కి ప్లాన్ చేసిన విషయం ఇప్పుడు నెమ్మదిగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సినిమాకి థియేట్రికల్ రిలీజ్ ని పిక్స్ చేశారు కానీ ఇది ఇప్పుడు ఓటిటిలో వచ్చింది. హిందీ వెర్షన్ లో మొత్తం సినిమాకి బాలయ్యే తన హిందీ డబ్బింగ్ చెప్పుకోవడం ఆసక్తిగా మారింది.

అంటే హిందీలో థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసి ఆపేశారని అనుకోవాలి. ఎందుకంటే కేవలం ఓటిటి కోసమే తాను హిందీ డబ్బింగ్ చెప్ప్పుకోవడం అంటే ఎక్కడో సింక్ అవ్వట్లేదు. సో భగవంత్ కేసరి నార్త్ రిలీజ్ లాస్ట్ మినిట్ లో ఆగిపోయి ఉండవచ్చు.