బాక్సాఫీస్ : రెండు హిట్స్ కొట్టినా “భగవంత్ కేసరి” డే 1 వసూళ్లు ఇంతేనా

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమానే “భగవంత్ కేసరి”. మరి అల్రెడీ రెండు సెన్సేషనల్ హిట్స్ కొట్టిన బాలయ్య మొట్ట మొదటిసారిగా దర్శకుడు అనిల్ రావిపూడితో చేసిన ఈ చిత్రం మంచి అంచనాలు నడుమ వచ్చింది.

కాగా దీనితో గత వీరసింహా రెడ్డి తరహాలోనే క్రేజీ బిజినెస్ ని కూడా జరుపుకున్న ఈ చిత్రం ఓ రేంజ్ లో అంచనాలు అందుకుంది. టాక్ సహా రివ్యూస్ కూడా బాగానే పడ్డాయి మెయిన్ గా అయ్యితే నిన్న రాత్రి నుంచి షోస్ బాగానే ఫిల్ కాగా మేకర్స్ ఇప్పుడు సినిమా వరల్డ్ వైడ్ మొదటి రోజు వసూళ్లు రివీల్ చేశారు.

దీనితో అయితే ఈ చిత్రం 32.33 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇది షాకింగ్ నెంబర్ అని చెప్పాలి. బాలయ్య రెండు హిట్స్ అందుకున్నాడు పైగా లాస్ట్ వీరసింహ రెడ్డి అయితే ఏకంగా సుమరీ 50 కోట్ల ఓపెనింగ్ ని అందుకుంది. అయినాయి కూడా భగవంత్ కేసరికి ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడం ఒకింత షాకింగ్ అని చెప్పాలి.

మరి రెండో రోజు నుంచి ఏమన్నా పుంజుకుంటుందో ఏమన్నా అనేది చూడాలి. ఇక ఈ మాస్ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వగా శ్రీ లీల బాలయ్య కూతురుగా నటించింది. అలాగే థమన్ ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం షైన్ స్క్రీన్ ప్రొడక్షన్ వారు నిర్మించారు.
https://x.com/UrsVamsiShekar/status/1715260291343409543?s=20