బాక్సాఫీస్ : “భగవంత్ కేసరి” మొదటివారం వసూళ్ల డీటెయిల్స్..!

ఈ దసరా కానుకగా అయితే టాలీవుడ్ లో దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా యంగ్ హీరోయిన్ శ్రీలీల ఒక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “భగవంత్ కేసరి” కూడా ఒకటి.

మరి దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హిట్ అయ్యి బాలయ్య కెరీర్ లో మరో సాలిడ్ గ్రాసర్ గా అయితే నిలిచింది. ఇప్పుడు ఆల్రెడీ దసరా మూమెంట్ ని క్యాష్ చేసుకున్న ఈ చిత్రం ఈ తర్వాత కూడా సాలిడ్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో అందుకున్నట్టుగా తెలుస్తుంది.

మరి నిన్నతో ఒక వారం రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వసూళ్లు ఇప్పుడు తెలుస్తున్నాయి. మరి మొదటి వారం భగవంత్ కేసరి వసూళ్ల డీటెయిల్స్ బాలయ్య సినీ ట్రాకర్ చెప్తున్నా దాని ప్రకారం చూస్తే.. నైజాం – 15.19 కోట్లు, సీడెడ్ -13.22 కోట్లు (హైర్‌లతో సహా), ఉత్తరాంధ్ర – 4.65కోట్లు (జి ఎస్ టి తో సహా), గుంటూరు – 5.45 కోట్లు, కృష్ణ – 2.85 కోట్లు, నెల్లూరు – 2.1 కోట్లు, తూర్పు గోదావరి – 2.66 కోట్లు, వెస్ట్ గోదావరి – 2.48 కోట్లు, కర్ణాటక – 4.02 కోట్లు, రెస్టాఫ్ ఇండియా – 0.70 కోట్లు,ఓవర్సీస్ – 6.8 కోట్లు షేర్ ని అందుకుంది.

ఇలా మొత్తం – 60.12 కోట్ల షేర్ ని భగవంత్ కేసరి అయ్యితే అందుకోగా 120 కోట్ల మేర గ్రాస్ ని ఈ చిత్రం అందుకుంది. దీనితో మొదటి వారం భగవంత్ కేసరి వసూళ్లు ఇలా ఉన్నాయి. అలాగే ఇంకో 10 కోట్లకి పైగా షేర్ ని అందుకుంటే ఈ చిత్రం లాభాల్లోకి వెళ్లినట్టు అవుతుంది.