దిల్ రాజు – శిరీష్ ల భజన ప్రోగ్రామ్ షురూ.

దిల్ రాజు నిర్మాతగా.. డిస్ట్రిబ్యూటర్ గా టాలీవుడ్ లో ఎంత పాపులర్ అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతకొంతకాలంగా దిల్ రాజు టాలీవుడ్ లో నిర్మాతగాను డిస్ట్రిబ్యూటర్ గాను లీడ్ లో ఉన్నాడు. స్టార్ హీరోల సినిమాలని నిర్మిస్తున్న దిల్ రాజు రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా సినిమాలని నిర్మిస్తున్నాడు. కాగా ఈ సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. అందరికంటే ముందే రవితేజ క్రాక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ప్రస్తుతం టాప్ లో ఉంది.

ఇక రాం రెడ్ సినిమా తో పాటు బెల్లంకొండ శ్రీను నటించిన అల్లుడు అదుర్స్ అలాగే తమిళ సినిమా డబ్బింగ్ మాస్టర్ కూడా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే బెల్లంకొండ శ్రీను అల్లుడు అదుర్స్ మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించిందని బెల్లంకొండ శ్రీను తండ్రి సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ సక్సస్ మీట్ లో వెల్లడించారు. కమర్షియలే కావాలి.. డబ్బులే కావాలి.. తొలి మూడురోజుల వసూళ్లు బావున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ 50కోట్ల క్లబ్ లో నిలుస్తాడని నమ్మకంగా చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను .. దిల్ రాజు మధ్య వివాదం గురించి బెల్లంకొండ సురేష్ మాట్లాడుతు.. దిల్ రాజు-శిరీష్ గురించి మాట్లాడే అర్హత శ్రీనుకి లేదని చెప్పుకొచ్చారు. దిల్ రాజు-శిరీష్ నైజాంలో లేకపోతే సినీపరిశ్రమలో నిర్మాతలే ఉండరని అభిప్రాయపడ్డారు. దిల్ రాజు-శిరీష్ లేకపోతే నైజాంలో డిస్ట్రిబ్యూషన్ లేదు. ఈ ఆరు ఏళ్లలో నేను ఆరు సినిమాలు చేస్తే వాళ్ళు వంద సినిమాలు చేశారు. శిరీష్ – రాజు అనేవారు నైజాంలో లేకపోతే డిస్ట్రిబ్యూషన్ ఉండేది కాదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన అభిప్రాయం మంచిదే అయినా ఇది భజన అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారట. ఏదేమైనా దిల్ రాజు-శిరీష్ గురించి బెల్లంకొండ సురేష్ మాట్లాడింది మాత్రం వాస్తవం అంటున్నారు.