బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 14న రాబోతోన్న అల్లుడు అదుర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది. ఈ వేడుకలో వివి వినాయక్, అనిల్ రావిపూడి వంటి దర్శకులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అందరూ మాట్లాడింది ఒకెత్తు. బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడింది మరో ఎత్తు. మైకు అందుకు బెల్లంకొండ ఇరగదీశాడు. మాట్లాడటం రాదంటూనే దుమ్ములేపేశాడు.
సినిమా గురించి, టెక్నీషియన్స్ గురించి గొప్పగా మాట్లాడాడు. ఓ సినిమా తీసి పెట్టమని మొదటి సారిగా తన నాన్నను అడిగానని, అలా ఈ సినిమా మొదలైందని చెప్పుకొచ్చాడు. ఇక దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ గురించి చెబుతూ..మామూలుగా ఎవ్వరైనా సినిమా మీద నాలుగైదు నెలలు కూర్చుంటారని కానీ మా డైరెక్టర్ మాత్రం ఒకటిన్నర ఏడాదిగా ఇదే ప్రాజెక్ట్ మీదున్నాడు. ఇంకా ఇంకా మెరుగులు దిద్దుతూనే ఉన్నాడు. చాలా కష్టపడ్డాడని తెలిపాడు.
అసలే నెపోటిజంపై చర్చలు జరుగుతున్న తరుణంలో బెల్లంకొండ కొన్ని కామెంట్లు చేశాడు. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న యాక్టర్స్ గురించి చాలా మంది ఏదో మాట్లాడుతుంటారు. దయచేసి బ్యాక్‌గ్రౌండ్ చూడటం మానేసి మా కష్టాన్ని చూడండి. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, అజయ్ దేవగణ్ స్టార్లు కాలేదు. వాళ్లు కూడా బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చినవాళ్లే. మా కష్టాన్ని నమ్ముకుని సినిమాల్లో ప్రయత్నిస్తాం. దయచేసి దాన్ని గుర్తించండి. ఒక మంచి సినిమా మీ అందరికీ ఇవ్వడానికి మేం చాలా కష్టపడి చేస్తామని ఎంతో గొప్పగా సింపుల్‌గా చెప్పేశాడు.