పవన్ డైరెక్టర్ తో బెల్లంకొండ సినిమా కన్మార్మ్

బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అల్లుడు శ్రీను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాను వీవీ వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. మొదటిసారి హీరోగా ఎంట్రీ ఇస్తూనే ఇద్దరు స్టార్ హీరోయిన్లతో నటించాడు ఈ కుర్రాడు. సమంత హీరోయిన్ గా నటించగా… తమన్నా ఓ ఐటెం సాంగ్ లో మెరిసింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి అప్పటినుండి ఇప్పటివరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సక్సెస్ ల కోసం ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు.

తాజాగా హీరో నెక్ట్స్ సినిమా గురించి ఓ అప్డేట్ వచ్చింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై బెల్లం కొండ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు పవన్ డైరెక్టర్ సాగర చంద్ర దర్శకత్వం చేస్తున్నట్లు సమాచారం. ఈ దర్శకుడు పవన్ కల్యాణ్ తో భీమ్లా నాయక్ సినిమా తీసి హిట్ కొట్టాడు. మళయాలంలో సూపర్ హిట్ అయిన సినిమాను తెలుగులో ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్లుగా పవన్ కల్యాణ్ , రానాలతో తెరక్కించడం ఒక ఎత్తైతే.. పవన్ కల్యాణ్ అభిమానల అంచనాలను అందుకోవడం మరో ఎత్తు.

ఈ విషయంలో సాగర్ చంద్రకు పుల్ మార్కులు సాధించారనే చెప్పవచ్చు. త్రివిక్రమ్ శిష్యూడిగా ఉంటూ… తన ఉనికిని చాటుకున్నాడు సాగర్ చంద్ర. అయితే తాజా వార్తల ప్రకారం సాగర్ చంద్ర ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే బెల్లంకొండకు కథ చెప్పేసాడని, బెల్లంకొండ కూడా ఓకే చేశాడని వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమా కన్మార్మ్ అయినట్లు తెలుస్తోంది.

బెల్లంకొండ ప్రస్తుతం బాలీవుడ్లో ఛత్రపతి రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తెలుగులో కొత్తగా రెండు సినిమాలు చేయడానికి అంగీకరించాడని టాక్. అందులో సాగర్ చంద్ర సినిమా కూడా ఉందని ఇండస్త్రీలో టాక్.