హిందీలో ప్రభాస్ ఛత్రపతి రీమేక్? హీరోగా బెల్లంకొండ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

bellamkonda sai srinivas to act in chhatrapati remake in hindi

మీకు ఛత్రపతి సినిమా గుర్తుందా? ప్రభాస్ రేంజ్ నే మార్చేసిన సినిమా అది. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా అది. ఆ సినిమా తెలుగు ఇండస్ట్రీలో రికార్డులను తిరగరాసింది. ప్రభాస్ ను స్టార్ హీరోను చేసిన సినిమా కూడా అదే.

bellamkonda sai srinivas to act in chhatrapati remake in hindi
bellamkonda sai srinivas to act in chhatrapati remake in hindi

ఇప్పుడు ఆ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. అయితే.. బాలీవుడ్ లో అనగానే.. ఏ బాలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తాడేమో అని అనుకుంటారు కానీ.. బాలీవుడ్ హీరో కాదు.. మన టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఆయన బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న సినిమా కూడా ఇదే. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండను హీరోగా పరిచయం చేసింది కూడా వీవీ వినాయకే. మళ్లీ ఆయన దర్శకత్వంలోనే బాలీవుడ్ కు సాయిశ్రీనివాస్ పరిచయం కాబోతున్నాడు.

bellamkonda sai srinivas to act in chhatrapati remake in hindi
bellamkonda sai srinivas to act in chhatrapati remake in hindi

ప్రస్తుతం సాయిశ్రీనివాస్.. అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. అల్లుడు అదుర్స్ తర్వాత సాయిశ్రీనివాస్… ఛత్రపతి రీమేక్ లో నటించనున్నాడు.