టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు పెళ్లి కుదిరిన సంగతి తెలుసు కదా. మూడు పదుల వయసులోనూ తన గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది కాజల్. తన చిన్ననాటి ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూను కాజల్ పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న కాజల్ పెళ్లి దగ్గరి సన్నిహితుల మధ్య జరగనుంది.
అయితే.. కాజల్ పెళ్లికి తాను కూడా వెళ్తున్నట్టు కాజల్ బెస్ట్ ఫ్రెండ్ బెల్లంకొండ శ్రీనివాస్ వెల్లడించారు. కాజల్ కాబోయే భర్త చాలా అదృష్టవంతుడు. కాజల్ నా బెస్ట్ బ్రెండ్. కాజల్ వ్యక్తిత్వం నాకు తెలుసు. తనకు దొరికేవాడు ఖచ్చితంగా అదృష్టవంతుడే. గౌతమ్ కిచ్లు కూడా గొప్ప వ్యక్తి. ఆమెకు మంచి భాగస్వామి దొరికాడు. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నా. కానీ.. ఎలాగైనా కాజల్ పెళ్లికి వెళ్తా.. అంటూ చెప్పుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్.
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ కలిసి సీత సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీళ్లు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరూ కలిసి చాలాసార్లు ఔటింగ్స్ కు కూడా వెళ్లారు.
లాక్ డౌన్ నుంచి ఇంట్లోనే ఉండి.. ఎక్కువగా ఆటల మీద దృష్టి పెట్టానని.. సుమారు 7 నెలల విరామం తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నానని… బెల్లంకొండ తన కొత్త సినిమా ముచ్చట్లను కూడా తన అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ.. అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటిస్తున్నాడు.