మెగా హీరో 13కోట్ల డీల్.. అలా తగ్గించి తెగ్గొట్టిన దిల్ రాజు

Varun Tej celebrates his milestone

ఒక హిట్టు పడగానే హీరోల రెమ్యునరేషన్ పెరగడం చాలా కామన్. ఈ మధ్య మీడియం హోరోలు అయితే డోస్ గట్టిగానే పెంచారు. ఇక దిల్ రాజు సినిమాలో నటించే స్టార్స్ చాలా వరకు రెమ్యునరేషన్ ను తగ్గిస్తారనేది ఇండస్ట్రీలో నిత్యం వినిపించే టాక్. సినిమా కథను బట్టి బడ్జెట్ కేటాయించే దిల్ రాజు చాలా వరకు ఎంతో ఆలోచించుకొని గాని సినిమాను స్టార్ట్ చేయడు. అవకాశం ఉంటే అడిగినంత ఇచ్చే ఈ సీనియర్ ప్రొడ్యూసర్ సినిమా బడ్జెట్ తగ్గితే రెమ్యునరేషన్ ను కూడా తగ్గించేస్తారనే టాక్ నడుస్తోంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే F3 సినిమాను వరుణ్ తేజ్ రిజెక్ట్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత మళ్ళీ ఓకే చెప్పినట్లు కూడా టాక్ వచ్చింది. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న గాసిప్ ఏమిటంటే.. మొదట వరుణ్ తేజ్ ఈ ప్రాజెక్ట్ చేయలేనని చెప్పిన వాస్తవమేనాట. వరుణ్ దాదాపు 13కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్ వచ్చింది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం ఉన్న మార్కెట్ కంటే వరుణ్ కాస్త ఎక్కువగానే అడిగాడట.

ఇక దిల్ రాజు తన బిజినెస్ మైండ్ తో ఆ దీలింగ్ ను తగ్గించి తెగ్గోట్టినట్లు టాక్ వస్తోంది. వరుణ్ అడిగినంత ఇవ్వకుండా న్యాయంగానే ఒక ఫిగర్ చెప్పడంతో ఫిదా అయినట్లు తెలుస్తోంది. ఇక జనవరి అనంతరం F3 మొదటి షెడ్యూల్ ను మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్, వెంకటేష్ తో పాటు మరో టాలెంటెడ్ హీరో కూడా నటించబోతున్నాడు. ఇక త్వరలో సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ వెలువడనుంది.