ఆ హీరోయిన్ కారణంగా .. తాను నా ఫేవరెట్ హీరో అయ్యారు: ఫరియ అబ్దుల్లా

జాతి రత్నాలు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు హైదరాబాది బ్యూటీ ఫరియ అబ్దుల్లా.నటనపై ఆసక్తితో ఈ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలియగానే ఈమె ఆడిషన్స్ లో పాల్గొని ఈ సినిమాలో అవకాశమందుకున్నట్లు వెల్లడించారు. హీరోయిన్ గా చిట్టి పాత్రలో జాతి రత్నాలు సినిమాలో నటించే అందరిని సందడి చేసిన ఈమె అనంతరం బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఇక హీరోయిన్ గా ఈమె నటించిన రెండవ చిత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.

ఈ సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమె తన ఫేవరెట్ హీరో హీరోయిన్ల గురించి పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఫరియ అబ్దుల్లా మాట్లాడుతూ.. వర్షం సినిమా చూసి తాను త్రిషకు అభిమానిగా మారిపోయానని ఈమె తెలిపారు. ఇలా వర్షం సినిమా తర్వాత త్రిష నటించిన నువ్వొస్తానంటే నేను వద్దంటానా అనే సినిమాని కూడా చూశానని ఈమె వెల్లడించారు.

ఈ విధంగా ఈ సినిమా చూస్తున్న సమయంలోనే తాను హీరో సిద్ధార్థకు అభిమానిగా మారిపోయాను అంటూ ఈ సందర్భంగా తన ఫేవరెట్ హీరో హీరోయిన్ల గురించి ఈమె చేస్తున్నటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే బంగార్రాజు సినిమాలో తనకు అవకాశం రావడం గురించి కూడా ఈమె తెలిపారు కాలేజీ చదువుతున్న రోజుల్లో నాగార్జున గారు తన కాలేజీ ఈవెంట్ కి రాగా నాగ్ సార్ తో కలిసి మాట్లాడి నెంబర్ తీసుకున్నానని అప్పటినుంచి తనని ఫాలో అవుతూ ఉన్నారని తద్వారా బంగార్రాజు సినిమాల్లో కూడా తనకు అవకాశం వచ్చిందని తెలిపారు.