Beast: మొన్న అరబిక్ కుతు…ఇపుడు జాలి ఓ జింఖాన… దుమ్ము లేపడానికి రెడీ అయిన విజయ్..!

Beast : తమిళ్ సినిమా హీరో దళపతి విజయ్ వరుస సినిమా విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. ఇటీవల వచ్చిన విజయ్ సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న బీస్ట్ తో బిజీగా ఉన్నారు. బీస్ట్ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.

ప్రేమికుల రోజు సందర్బంగా బీస్ట్ సినిమాలోని హలమితి హబిబో..పాట లిరికల్ వీడియోను విడుదల చేసారు చిత్ర యూనిట్. విడుదలైన రోజునుండి ఎప్పటికి అత్యధిక వ్యూస్ అందుకుంటూ రికార్డులు సృష్టిస్తుంది. ఈ పాటకు దళపతి విజయ్ తో పాటూ బుట్టబొమ్మ వేసిన స్టెప్పులిప్పుడు ఫుల్ వైరల్ గా మారాయి.అంతేకాదు షరా మామూలుగా వ్యూస్, లైక్స్ రికార్డ్స్ తో.. హలమితి హబిబో.. ఓ వైపు దుమ్ము రేపుతుంటే.. ఇక మరో పక్క సాధారణ జనం నుంచి సెలెబ్రిటీస్ వరకు ఈ పాట రీల్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జాలీ ఓ జింఖానా అంటూ సాగే ఈ సాంగ్ ని హీరో విజయ్ పాడడం విశేషం.. గోవా బీచ్ ఒడ్డున మ్యూజిక్ బ్యాండ్ తో రాక్ స్టార్ లా విజయ్ మైక్ పట్టుకొని పాడుతుండగా.. హీరోయిన్ పూజా, డైరెక్టర్ నెల్సన్, అనిరుధ్ డాన్స్ చేస్తూ కనిపించారు.

ఇక ఈ ఫుల్ సాంగ్ ని మార్చి 19 న విడుదల చేయనున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. నారి మొన్న అరబిక్ కుత్తులా ఈ జాలీ ఓ జింఖానా కూడా రికార్డులు సృష్టిస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14 న రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలి.