Beast : సక్సెస్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్న బీస్ట్ టీం…!

Beast : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా, పూజా హెగ్డే హీరోగా నటించిన చిత్రం బీస్ట్.తమిళ స్టార్ డైరెక్టర్ అయిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలకు ముందే చిత్రం నుంచి విడుదలైన అరబిక్ కు తూ పాట యూ ట్యూబ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద అంచనాలు పెరగడానికి ఈ పాట కూడా ఒక కారణం డాక్టర్ విజయం తరువాత నెల్సన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అందులోనూ, వరుస హిట్లతో జోరు మీద ఉన్న విజయ్ హీరోగా నటించడం కారణంగా విడుదల ముందు అభిమానుల లో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఏప్రిల్ 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా మీద అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలను అందుకోలేక పోయినా తమిళనాట సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తెలుగులో మాత్రం ఈ సినిమాకి ఆశించిన విజయం దక్కలేదు.12 రోజుల్లో తమిళనాడులో బీస్ట్ సినిమా రూ.111 కోట్లు వసూలు చేసింది. వన్ మ్యాన్ ఎట్ బాక్సాపీస్ గా రికార్డు క్రియేట్ చేసింది. సినిమా విడుదల అయిన రెండవ వారం కూడా సినిమా బాగా నడుస్తోంది అని ఫిల్మ్ ఎంటర్ టైన్ మెంట్ ట్రాకర్ కౌశిక్ ట్వీట్ చేశాడు.

బీస్ట్ సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతూ ఉండటంతో చిత్ర బృందం సక్సెస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో విజయ్‌, పూజాహెగ్డే, డైరెక్టర్ నెల్సన్ తో పాటు చిత్రయూనిట్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.